Lord Vishnu Favourite Lucky Zodiac Signs: శ్రీమహావిష్ణువుకి కొన్ని రాశులు అంటే చాలా ఇష్టం. గృహస్పతి శ్రీమహావిష్ణువుకి జ్యోతిష్య శాస్త్రంలో ప్రత్యేకమైన సంబంధం ఉంది. కాబట్టి ఈ గ్రహం శుభస్థానంలో ఉన్న రాశుల వారికి ఎల్లప్పుడూ మేలే జరుగుతుంది. ఇందులో మీ రాశి కూడా ఉందా?
Lord Vishnu Favourite Lucky Zodiac Signs: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ద్వాదశరాశులు, తొమ్మిది గ్రహాలకు ఎంతో ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. నవగ్రహాలు కాలానికి అనుగుణంగా ఒక రాశి నుంచి మరొక రాశికి సంచారం చేస్తూ ఉంటాయి. అలాగే ఇదే క్రమంలో నక్షత్ర సంచారాలు కూడా చేస్తూ ఉంటాయి. దీనివల్ల ప్రత్యేకమైన ప్రభావం ఏర్పడుతూ ఉంటుంది ఇది అన్ని రాశుల వారిపై సమానంగా పడుతుంది. ఇదిలా ఉంటే హిందూ పురాణాల్లో ఎంతో ప్రాముఖ్యత కలిగిన దేవతలలో విష్ణుమూర్తికి కూడా కొన్ని రాశులు అంటే చాలా ఇష్టమని పురాణాల్లో పేర్కొన్నారు.
హిందూ పురాణాల ప్రకారం విష్ణుమూర్తని ప్రత్యేకమైన దేవుడిగా భావిస్తారు. ఆయన అనుగ్రహం లభిస్తే బిచ్చగాళ్లు కూడా ధనవంతులవుతారని పురాణాలకు సంబంధించిన అనేక కథలు ఉన్నాయి. అయితే విష్ణుమూర్తి అనుగ్రహం కొన్ని రాశుల వారిపై ఎల్లప్పుడూ ఉంటుంది. వీరు ఎలాంటి పనులు చేసిన డబ్బుతో పాటు అదృష్టాన్ని కూడా పొందుతారు.
జ్యోతిష్య శాస్త్రంలో గృహస్పతి గ్రహానికి విష్ణుమూర్తికి ప్రత్యేకమైన సంబంధం ఉందని భావిస్తారు. అందుకే గృహస్పతి గ్రహం శుభస్థానంలో ఉన్న రాశుల వారికి ఎల్లప్పుడూ లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. దీనివల్ల జీవితం ఎంతో సులభంగా ముందుకు సాగుతూ ఎలాంటి కష్టాలు లేకుండా డబ్బులు సంపాదించగలుగుతారు. అయితే విష్ణు కి అత్యంత ఇష్టమైన రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
విష్ణుమూర్తి ఎల్లప్పుడూ ఇష్టపడే రాశుల్లో సింహరాశి ఒకటి. ఈ రాశి వారు ఎల్లప్పుడూ విష్ణువు అనుగ్రహంతో అదృష్టాన్ని పొందడమే కాకుండా జీవితంలో గొప్ప విజయాలు సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే రాజకీయ నాయకులయితే సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు పొంది ఉన్నత పదవుల్లో సమాజాన్ని ఏలుతారు. అంతేకాకుండా ఏ పనులను వీరు వెనకంజ వేయకుండా ముందుకు సాగుతూ ఉంటారు.
ఎల్లప్పుడు తులా రాశి వారిపై కూడా విష్ణువు అనుగ్రహం ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఉద్యోగాల్లో వ్యాపారాల్లో మంచి విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా వైవాహిక జీవితంలో వస్తున్న సమస్యలను కూడా పూర్తిగా పరిష్కరించుకొని ఒక ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు. అలాగే ఈ రాశి వారు సంతోషకరమైన జీవితాన్ని కూడా పొందుతారు. అంతేకాకుండా ఎల్లప్పుడూ వీరు కర్తవ్యాన్ని నిర్వహించడంలో ముందుంటారు.
కర్కాటక రాశి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం తో పాటు విష్ణు ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి కాబట్టి వీరు ఎంతో చురకుగా ఉంటారు. వీరు ఎలాంటి పనులు చేయడంలో వెనకంజ వేయకుండా దూసుకుపోతూ ఉంటారు. అంతేకాకుండా వీరి జీవితం విజయం దశగా కొనసాగుతూ ఉంటుంది. అలాగే వీరికి ఉద్యోగాలపరంగా ఎలాంటి లోటు లేకుండా ఉంటుంది.
విష్ణుమూర్తి, లక్ష్మీదేవిలకు ఎంతో ఇష్టమైన రాశుల్లో వృషభ రాశి కూడా ఒకటి. ఈ రాశి వారికి విష్ణువు అనుగ్రహం ఎల్లప్పుడూ లభించి జీవితంలో అద్భుతమైన నీకు సానుకూల ఆలోచనలతో ముందుకెళ్తారు. అలాగే వీరు డబ్బులు సంపాదించడంలో ముందుంటారు. వ్యాపారాలు చేస్తున్న వారికి ఎప్పుడు లాభాలు వస్తూనే ఉంటాయి. ఆర్థికంగా కూడా చాలావరకు లాభాల్లోనే ఉంటారు.