AP Liquor Policy: షాపులు ఒదిలేసి వెళ్లిపోండి.. మద్యం వ్యాపారులకు మద్యం సిండికేట్ మాస్ వార్నింగ్..

 
AP Liquor Policy: ఆంధ్ర ప్రదేశ్ లో లాటరీ ద్వారా మద్యం షాపులను కేటాయించిన ప్రభుత్వం.. నిన్న ఉదయం నుంచే లాటరీ ద్వారా లబ్దిదారులను ఎంపిక చేసిన సంగతి తెలసిందే కదా. ఇక రేపటి నుంచే ఏపీలో కొత్త ప్రైవేటు మద్యం షాపులు తెరచుకోనున్నాయి.

1 /6

ఇప్పటికే లాటరీలో మద్యం షాపులను దక్కించుకున్న మద్యం వ్యాపారులు అందుకు త్వర త్వరగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కొత్త మద్యం షాపులకు లాటరీ ప్రక్రియ ముగియడంతో ఏపీలో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి.

2 /6

లాటరీలో విజేతలుగా నిలిచి లైసెన్సులు దక్కించుకున్న కొంత మందికి కొన్ని నియోజకవర్గాల్లోని ముఖ్య నాయకులు, మద్యం సిండికేట్ల నుంచి ఒత్తిళ్లు ఎదురవుతున్నాయి.

3 /6

నియోజకవర్గ పరిధిలో వ్యాపారం చేయాలంటే  20 శాతం వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ఇక్కడ వ్యాపారం ఎలా చేస్తారో చూస్తా మంటూ బెదిరింపులకు దిగుతున్నారు.

4 /6

మరికొందరు గుడ్‌ విల్‌ ఇస్తాం వదిలి వెళ్ళి పోవాలని ఒత్తిడి తెస్తున్నారట. రేపటి నుంచి  మద్యం దుకాణాలు తెరుచుకోనున్న నేపథ్యంలో ఈ బెదిరింపులు మరింత  ఎక్కువయ్యాయి.  

5 /6

లాటరీ ద్వారా ఎంపికయిన వారికీ  లిక్కర్  షాపులను అప్పగించనున్నారు. ఈ నెల 16 నుంచి రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ అమల్లోకి రానుంది.

6 /6

ఏపీలో కొత్తగా తీసుకొచ్చిన మద్యం విధానంలో లిక్కర్ ను తక్కువ ధరలకు తగ్గించి అతి తక్కువ ధరకే అందించడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసుకుంది. ఇప్పటికే కొత్త మద్య విధానంపై ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే కదా.