Health Benefits: చాలా మంది బెల్లీఫ్యాట్ తో ఇబ్బందులు పడుతుంటారు. నడుము, పొట్ట భాగంలో చాలా మందికి అనవసర కొవ్వు పేరుకుపోయి ఉంటుంది. దీంతో నడవటానికి కూడా ఇబ్బంది పడతారు.
ప్రస్తుతం చాలా మంది తమ ఉద్యోగాలలో తీరికలేకుండా బిజీగా ఉంటున్నారు. వర్క్ స్టైల్ కూడా పూర్తిగా మారిపోయింది. అందుకే వేళాపాళ లేకుండా తినడం చేస్తుంటారు. దీంతో శరీరంలో అనేక మార్పులు వస్తాయి.
కొందరు బైటి ఫుడ్, జంక్ ఫుడ్ లను ఎక్కువగా తింటారు. దీనిలో ఆయిల్ శాతం ఎక్కువగా ఉంటుంది. దీంతో విపరీతమైన కొవ్వులు శరీరంలో పేరుకుపోతుంది. గంటల తరబడి కూర్చుని పనులు చేస్తుంటారు
తినడం వేళల్లోమార్పుల వల్ల.. సరిగ్గా జీర్ణం కాదు. కొందరు మోతాదుకన్న చాలా ఎక్కువగా తినేస్తుంటారు. దీని వల్ల కూడా లావుగా కన్పిస్తుంటారు. వర్క్ చేసేటప్పుడు మధ్యలో కాస్తంత విరామం ఇవ్వాలి..
ఉదయంపూట తప్పకుండా శారీరక శ్రమ ఉండేలా చూసుకొవాలి. వ్యాయామం, సైక్లింగ్, యోగాల వంటివి చేయాలి. బైటిఫుడ్ ను తినడం పూర్తిగా అవాయిడ్ చేయాలి. డ్రైఫ్రూట్స్ ఎక్కువగా తినాలి.
ఆయిల్ ఫుడ్స్, పిజ్జాలు, బర్గర్ లకు పూర్తిగా దూరంగా ఉండాలి. ఎక్కువగా ఒత్తిడిలేకుండా చూసుకొవాలి. కొందరిలో లావుగా ఉండటం అనేది వాళ్ల జీన్స్ లలో ఉంటుంది. కానీ దీన్ని కంట్రోల్ చేసుకొవాలి.
ఆఫీసులకు వెళ్లేటప్పుడు, అవకాశం ఉన్న వారు సైక్లింగ్ చేస్తు వెళ్లాలి. ప్రతిరోజు వాకింగ్ చేయడం, సమయానికి తినడం,రాత్రిపూట ఎక్కువగా మేల్కొనక పోవడం వంటివి చేస్తే ఈ బెల్లీఫ్యాట్ ను అవాయిడ్ చేసుకొవచ్చు.