Karthika Deepam 2 Today December 8 Episode: డైనింగ్ టేబుల్ వద్ద జో తోపాటు కుటుంబ సభ్యులు తింటుంటారు. సుమిత్ర.. ఇది కూడా నువ్వు చేశావా? ఇంకెవరైనా చేశారా? అంటుంది పారిజాతం. దీప కూడా నీలానే పోపులో ఇంగువ వేస్తుంది అంటుంది. అప్పుడే శివన్నారాయణ ఇప్పుడు ఆ మనిషి విషయాలు ఎందుకు అంటాడు..
ఇక జో తాతా మన కంపెనీకి సంబంధించి ఒక పని చేశా అంటుంది. నువ్వే ఏదైనా చేయ్ మన కంపెనీ మాత్రం ఫస్ట్‌లో ఉండా అంటాడు. ఆ కార్తీక్‌గాడు ఇడ్లి బండీ పెట్టుకుని మన కంపెనీకి పోటీ వద్దామనుకుంటున్నాడు. ఇలా మెట్లు ఎక్కి వచ్చినవారితో పడలేరు అంటాడు. చూడమ్మ నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా మంచి పేరు తేవాలి అంటాడు. తప్పుకుండా తాతయ్య నన్ను చూసి ఫ్యూచర్‌లో గర్వపడతావు అంటుంది.
మరోవైపు కార్తీక్ దీపలు కంపెనీని నమ్ముకుని ఇలా ఉద్యోగం నుంచి తీసెయడం ఏంటి మీరు మాత్రం గొడవకు పోకండి అంటుంది. 50 దాటిన తర్వాత డ్యూటీ నుంచి తీసేయాలంటే ముందు తీసేయాలి అంటాడు. అది మీ కుటుంబం అని మర్చిపోకండి అంటుంది దీప. నాకు తెలుసు ఇది జ్యోత్స్న చేసిన పని కాని, తాతగారు చేసింది కాదు. ఆయన ఇలాంటివి ఒప్పుకోరు మార్చేశారు అంటుంది దీప. మీరు ఒకసారి తాతగారితో మాట్లాడండి అంటుంది దీప. బతిమాలుకోవాలా? వారు మాటలు చెబితే వినరు దీప అంటారు. ముందు మాట్లాడకుంటా చేస్తే సమస్య పెద్దది అవుతుంది బాబు.
మాట్లాడితే న్యాయం జరగదు దీప. వాళ్లు బాధపడతారని నువ్వు బాధపడతావు అంటాడు కార్తీక్. మరోసారి మీ అమ్మ కోసం ఆలోచించండి బాబు అంటుంది దీప. తన బాధ మనకు చెప్పడం లేదు తాతగారి కుటుంబంతో గొడవ పెట్టుకుంటారని బాధపడుతున్నారు. ఓ సాధారణ మనిషిలాగే ఆ ఉద్యోగుల తరఫున మాట్లాడండి బాబు అంటుంది. జరిగిన తప్పు సరిచేసుకుంటారు. అప్పుడు ఏ నిర్ణయమైన మీరు తీసుకోండి నేను కూడా మీతోనే ఉంటా అంటుంది.
ఈ దారిలో న్యాయం జరగదు దీప అంటాడు కార్తీక్. మీరు ట్రై చేసి చూడండి, మీ అమ్మగారి మనస్సునైతే బాధపెట్టకండి మరోసారి ఆలోచించండి అంటుంది దీప. ఇక జో, వర్క్‌లో బిజీ ఉంటుంది. పారు పాలు తెచ్చి ఇస్తుంది. అయ్యోయ్యో సెల్‌ఫోన్‌లో వీడియోలు చూసుకునే పాపను ఎలా మార్చారు అంటుంది. డిస్టర్బ్ చేయకు గ్రానీ అంటుంది జో. నిన్ను చూస్తుంటే కంపెనీని ఎక్కడికో తీసుకెళ్లేలా ఉన్నావే అంటుంది పారు.
కంపెనీలో ఏదో చేశా అన్నావు కదా? ఏం చేశావు అంటుంది పారు. నీ ఎదుగుదల వెనుక ఈ గ్రానీ కష్టం ఉందని ఈ గ్రానీని గుర్తుంచుకో అంటుంది. ఇప్పుడే ఏం చేశావు? అంటుంది గ్రానీ, నీలాంటి ఏజ్ అయిన మన కంపెనీకి బరువు అయినవారిని జాబ్‌లో నుంచి తీసేశా అంటుంది. పారు కంగుతింటుంది. ఎవర్ని అడిగి చేశావే.. కొట్టానంటే మూతిపళ్లు రాలిపోతాయి. పోయింది..మొత్తం పోయింది అని గగ్గోలు పెడుతుంది. తాత నాకు అధికారం ఇచ్చాడు నచ్చినట్లు చేయమన్నాడు అంటుంది జో. విషయం తెలిస్తే నాలుగు పీకుతాడు అంటుంది
మీ తాతయ్యకు తెలువక ముందే వారిని వెంటనే ఉద్యోగంలోకి తీసుకో అంటుంది పారు. తమరి ఉచిత సలహాలకు థ్యాంక్స్ అంటుంది జో. చాలా పెద్ద తప్పు చేసింది ఇది అంటించి వదిలేసిన బాంబ్ ఏ క్షణమైన పేలవచ్చు అని మనసులో అనకుంటుంది పారు.తెల్లవారుతుంది హాల్‌లో దశరథ శివన్నారాయణలకు కాఫీ ఇస్తుంది సుమిత్రమ్మ. మరోవైపు జో ను పారు ఇంత దారుణం చేసి కాఫీ ఎలా తాగుతున్నావే అంటుంది. రాత్రి నుంచి చూస్తున్నా ఏంటి నీగోల అంటుంది ఎవరు అడుగుతారు. అంత దమ్ము ఎవరికైనా ఉందా? అంటుంది. అప్పుడే కార్తీక్ వచ్చి శివన్నారాయణ అని పేరు పెట్టి పిలుస్తాడు.
కోపంతో బయటకు వస్తాడు శివన్నారాయణ, నా ఇంటి గుమ్మం ముందు నిలబడి నన్నే పేరుపెట్టి పిలుస్తున్నావ్ ఎవర్రా నువ్వు అంటాడు. నాపేరు కార్తీక్, టిఫిన్ సెంటర్ ఓనర్‌ను అంటాడు, అయితే, పోయి ఇడ్లీలు అమ్ముకో అంటాడు తాత. నేను కార్తీర్‌గా వచ్చాను అంటాడు. దశరథ వాడు నా మేనల్లుడు అంటాడు నాకు మనవడు కాదు అంటాడు. ఒకప్పుడు నేను మీ కంపెనీలో పనిచేసిన మాజీ క్వాలిటీ సూపర్‌వైజర్‌ను అంటాడు.
ఎందుకు బావ పంతం రా.. లోపల కూర్చొని మాట్లాడుకుందాం అంటుంది జో. అదేమాట మీ తాతయ్యను చెప్పమను అంటాడు కార్తీక్. ముందు నాకు సారీ చెప్పమను అప్పుడు లోపలికి రమ్మని చెబుతాను అంటాడు శివన్నారాయణ. మీరు కంపెనీ కోసం తీసుకుంటున్న నిర్ణయం, అరాచకాల గురించి అంటాడు. నీతో చెప్పించుకునే పరిస్థితిలో లేను అంటాడు శివన్నారాయణ. నువ్వు ఎవర్రా నా తప్పుల గురించి మాట్లాడటానికి, గురువింద గింజ తన నలుపును ఎరుగనట్లుంది అంటాడు తాత.
బావ ఆఫీస్ ఎంప్లాయీస్ గురించి మాట్లాడుతాడా అనుకుంటుంది జో. ఏమైనా కంపెనీ వ్యవహారాలు ఉంటే జ్యోత్స్న తో మాట్లాడు అంటాడు తన వల్లే తప్పు జరిగితే అంటాడు. నేను నువ్వు చెప్పేది వినను అంటాడు. ఒకఆడపిల్ల నీకంటే గొప్పగా కంపెనీని నడుపుతుంటే బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాడు, రోడ్డున పడ్డావు కదా కడుపుమండుతున్నట్లుంది జ్యోత్స్ననా మనవరాలు, నా కంపెనీ సీఈఓ నిన్నే అద్భుత నిర్ణయం తీసుకుందంట అంటాడు. నాకు నమ్మకం ఉంది.
అంటే ఆ నిర్ణయం ఎలాంటిదైనా మీరు సమర్థిస్తా అంటారా అని కార్తీక్ అంటాడు. నా మనవరాలి మాటే నామాట ఇదే ఆఖరి మాట అంటాడు అయితే, ఆల్ ది బెస్ట్ అంటాడు కార్తీక్. నా కంపెనీ విషయాలు నీకు ఎందుకు ముందుగా ఆ విషయం చెప్పి బయటకు వెళ్లు అంటాడు శివన్నారాయణ.మీరు చేయాల్సింది మీరు చేశారు కదా.. నేను చేయాల్సింది నేను చేస్తా అంటాడు కార్తీక్.
అక్కడి నుంచి వెళ్లిపోతుంటాడు.. ఏయ్ కార్తీక్ అని పిలుస్తుంది సుమిత్ర. మనం వాడి వద్దకు వెళ్లడం లేదు కదా మనతో మాట కలుపుదామని వచ్చాడు అంటాడు తాత. నీకు చేతనైంది చేసుకోరా అంటాడు. కార్తీక్ ఏం చెప్పాలని వచ్చాడో మనం వినాల్సింది నాన్న అంటాడు దశరథ. మీరు అనవసరంగా వాడిని హీరో చేయకండి అంటాడు. వాడేదో అనేసి పోయాడు అని ఆలోచించకండి. అవన్నీ చేతగాని పనులు, చేతగాని మాటలు అంతకు మించి ఏం లేదు అని లోపలికి వెళ్లిపోతాడు.