Beer: బీర్లు తాగితే ఆరోగ్యానికి మంచిదా? వారంలో ఎన్ని తాగాలో తెలుసా?

Beer Is Good For Your Health Here Is Facts: తాగుడు అలవాటు నేటి కాలంలో సర్వ సాధారణమైంది. అయితే ఆరోగ్యానికి కొంత మేలు చేసేలా మద్యం తీసుకోవడం మంచిదే. అయితే ఎంత మోతాదులో తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది? వారంలో ఎన్ని బీర్లు తాగాలో తెలుసా?

1 /9

బీర్‌ తయారీ: గోధుమ, బార్లీ వంటి ధాన్యాలను పులియబెట్టడంతో బీర్‌ను తయారుచేస్తారనే విషయం అందరికీ తెలిసిందే. అయితే వారానికి ఎన్ని బీర్లు బెస్ట్ అనేది తెలుసుకుందాం.

2 /9

అత్యధికంగా: మద్య పానీయాల్లో అత్యధికంగా బీర్ సేవిస్తున్నారు. బీర్‌లలో 4 నుంచి 6 శాతం వరకు ఆల్కహాల్ ఉంటుంది.

3 /9

ప్రయోజనాలు: మితంగా బీర్ తాగితే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువైతే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.

4 /9

నివేదిక: నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్‌హెచ్‌ఎస్‌) నివేదిక ప్రకారం పురుషులు, మహిళలు వారానికి 14 యూనిట్ల కంటే ఎక్కువ మద్యం తాగకూడదని స్పష్టం చేసింది. 14 యూనిట్లు 10 మిల్లీ లీటర్లు లేదా 8 గ్రాముల స్వచ్ఛమైన ఆల్కహాల్. ఉదాహరణకు 568 మిల్లీ లీటర్ల సాధారణ బీర్‌ క్యాన్‌లో 5 శాతం ఆల్కహాల్ ఉంటుంది. దాదాపు 3 యూనిట్ల ఆల్కహాల్ ఉంటుంది.

5 /9

ఎంత తాగాలి: వారంలో 6 క్యాన్ల సాధారణ బీర్ తాగితే మీరు 14 యూనిట్ల పరిమితిలో ఉంటారు. అంతకు మించి తాగవద్దవని నిపుణులు సూచిస్తున్నారు. రెగ్యులర్ డ్రింక్స్ ప్రతి వారంలో రెండు రోజులు మానేయాలి. ఇలా చేస్తే ఆల్కహాల్ ప్రభావం నుంచి శరీరం కోలుకోవడానికి సమయం లభిస్తుంది.

6 /9

గుండెకు మంచిది: బీర్‌లోని హెచ్‌డీఎల్ లేదా మంచి కొలెస్ట్రాల్ గుండెకు మంచిది. ఇది ఎక్కువగా ఉంటే గుండెపోటు ప్రమాదాలు తగ్గుతాయి. బీర్‌లలో తక్కువ మొత్తంలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు ఉండడంతో అవి ఎముకలను దృఢపరుస్తాయి. ఫలితంగా బోలు ఎముకల వ్యాధి వచ్చే ఆస్కారం లేదు.

7 /9

స్త్రీ, పురుషులు: బీర్‌లో పాలీఫెనాల్స్ అనే పదార్థాలు ఉన్నాయని గుర్తించారు. పాలీఫెనాల్స్ గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. రోజుకు ఒక బీరు తాగే మహిళలు, రెండు బీర్లు తాగే పురుషులకు గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని అధ్యయనంలో తేలింది.

8 /9

అతి అనర్థం: పరిమితికి లోబడి తాగితే మంచిదే పరిమితి దాటితే అనర్థమే. అధికంగా బీర్ తాగడం వల్ల కాలేయం, గుండె సమస్యలు, క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. బీర్ తాగితే అధికంగా తీసుకుంటే మీ శరీరం నీటి శాతం కోల్పోతుంది. ఇది డీహైడ్రేషన్ కారణంగా తలనొప్పి, నోరు పొడిబారడం, నీరసం వంటి సమస్యలు వస్తాయి.

9 /9

నిద్రలేమి: బీర్ తాగితే నిద్రలేమి ప్రధానంగా ఉత్పన్నం అవుతుంది. మద్యం అనేది ఒకసారి అలవాటయితే అది వ్యసనమవుతుంది. అందుకే అలవాటు చేసుకోకపోవడం మంచిది. ఒకవేళ అలవాటైతే పూర్తిగా మానేయడం మంచిది.