Happy Bhogi 2025: భోగి పండుగ శుభాకాంక్షలు, ప్రత్యేకమైన కోట్స్, HD ఫొటోస్..

Happy Bhogi Wishes Images 2025: ప్రతి సంవత్సరం సంక్రాంతికి ముందు జరుపుకునే పండగే భోగి పండగ.. ఈ పండగ రోజున ప్రతి ఒక్కరూ భోగిమంటలు వేసుకొని ఎంతో ఆనందంగా రోజును కొనసాగిస్తారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన రోజున మీ కుటుంబ మీ కుటుంబ సభ్యులకు భోగభాగ్యాలు కలగాలని కోరుకుంటూ.. ఇలా శుభాకాంక్షలు తెలియజేయండి.
 

Happy Bhogi Wishes Images 2025: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ పండగ మొత్తం మూడు రోజులపాటు కొనసాగుతుంది. మొదటి రోజున భోగి పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ముఖ్యంగా దక్షిణాయన సమయంలో సూర్యుడు భూమికి నెమ్మదిగా దూరంగా వెళుతూ ఉంటాడు. దీని కారణంగా ఉష్ణోగ్రతలు పడిపోయి.. చలి కూడా విపరీతంగా పెరుగుతుంది. ఈ సమయంలో ప్రజలంతా చలిని తట్టుకునేందుకు భగభగ మండే మంటలు వేస్తారు. ఇలా మంటలు వేసుకోవడాన్ని భోగిమంటలని పేరు వచ్చిందని పూర్వీకులు తెలుపుతున్నారు. అప్పటినుంచి ఇప్పటివరకు సంక్రాంతికి ముందు రోజు భోగి మంటలు వేసుకొని భోగి పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన పండుగ రోజున మీ వెన్నంటే నిలిచే ప్రతి ఒక్కరికి ఇలా భోగి శుభాకాంక్షలను తెలియజేయండి.
 

1 /10

ఎంతో ప్రాముఖ్యత కలిగిన భోగి పండుగ మీ జీవితాల్లో భోగభాగ్యాలతో పాటు సుఖసంపదలను తీసుకురావాలని ఆకాంక్షిస్తూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ.. భోగి పండగ శుభాకాంక్షలు..  

2 /10

ప్రతి ఏడాది భోగి పండుగ నుంచి భోగభాగ్యాలు లభించాలని ఆ శ్రీమహావిష్ణువుని కోరుకుంటూ.. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ పేరుపేరునా భోగి పండుగ శుభాకాంక్షలు. 

3 /10

భోగ భాగ్యాలను ఇచ్చే భోగి పండుగ.. సరదాలను తీసుకువచ్చే సంక్రాంతి పండగ, కమ్మని పిండి వంటలు అందించే కనుమ పండగ ప్రతి ఏడాది మీ కుటుంబ సభ్యులతో జరుపుకోవాలని కోరుకుంటూ.. మీ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు.

4 /10

పొద్దున్నే వేసే భోగి మంటలు మీ జీవితంలో చెడును తొలగించి.. మంచిని, సానుకూలతను నింపి.. జీవితంలో ఉన్నత శిఖరాలకు చేర్చాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు.

5 /10

ఈ భోగిమంటలు మీ మనసులోని అశాంతిని తొలగించి.. మంచి ప్రేమను, భోగభాగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ మీ అందరికీ పేరుపేరునా భోగి పండుగ శుభాకాంక్షలు. 

6 /10

సంక్రాంతి తెచ్చే కొత్త వెలుగులే.. భోగిమంటల రూపంలో మీకు అందాలని, జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ.. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు.   

7 /10

భోగి మంటల్లోనే మీ కష్టాలు, అశాంతి, బాధలు పోవాలని.. వెలుగు రూపంలో కొత్త ఆనందం, సానుకూలత, సంతోషాలు రావాలని కోరుకుంటూ మీ మేలుకోరే ప్రతి ఒక్కరికి భోగి పండుగ శుభాకాంక్షలు..

8 /10

భోగిమంటలు మీ కష్టాలను, దుఃఖాన్ని దహించి వేసి.. జీవితంలో భోగభాగ్యాలను ప్రసాదించాలని.. కోరుకుంటూ.. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ భోగి పండగ శుభాకాంక్షలు.   

9 /10

భోగి మంటలు మీ దీర్ఘకాలిక వ్యాధులను తొలగించి.. నిత్యజీవితంలో అద్భుతమైన ఆరోగ్యాన్ని శ్రేయస్సును ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ.. ఆనందంతో భోగి పండగ జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ.. ప్రతి ఒక్కరికి భోగి పండుగ శుభాకాంక్షలు. 

10 /10

ఈ భోగి పండుగ మీకు తరగని ధన ధాన్యాలను ప్రసాదించాలని.. సిరి సంపదలను కురిపించాలని కోరుకుంటూ.. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు.