Senior Citizen Savings Scheme: రిటైర్మెంట్ తర్వాత స్థిరమైన ఆదాయం, ఆర్థిక భద్రతను కోరుకునే వారికి సీనియర్ సిటిజన్ సేవింగ్స్ ప్లాన్ బెస్ట్ఆప్షన్. ఐదు సంవత్సరాల మెచ్యూరిటీ వ్యవధి తర్వాత రెన్యువల్ ఆప్షన్ తో మీ ఆర్థిక భవిష్యత్తును కాపాడుకోవడానికి నమ్మదగిన ప్లాన్ అని చెప్పవచ్చు.ఈ స్కీము గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Senior Citizen Savings Scheme: ఉద్యోగం తర్వాత రిటైర్మెంట్ గురించి చాలా మంది ఆందోళన చెందుతారు. రిటైర్మెంట్ తర్వాత నెలవారీ ఆదాయం లేకపోవడంతో ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొవల్సి వస్తుంది. రిటైర్మెంట్ తర్వాత భవిష్యత్ బాగుండాలంటే సీనియర్ సిటిజన్ల కోసం బెస్ట్ సేవింగ్స్ స్కీమ్ ఉంది.
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS. ఈ స్కీము ప్రభుత్వ మద్దతుతో అత్యధిక వడ్డీ రేట్లను అందిస్తుంది. సంవత్సరానికి 8.2% వడ్డీ రేటుతో, SCSS సీనియర్ సిటిజన్లకు వారి పదవీ విరమణ నిధులను సురక్షితంగా ఉంచడానికి.. అదే సమయంలో సాధారణ ఆదాయాన్ని పొందే అవకాశాన్ని అందిస్తుంది. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా, సీనియర్ సిటిజన్లు సులభంగా నెలవారీ పెన్షన్‌గా రూ.20 పొందవచ్చు.
సీనియర్ సిటిజన్లు వ్యక్తిగతంగా లేదా వారి జీవిత భాగస్వామితో కలిసి SCSS ఖాతాను తెరవవచ్చు. ఈ పథకం కనీసం రూ.1000 పెట్టుబడితో ఖాతాకు గరిష్టంగా రూ.30 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. రూ. 1 లక్ష వరకు డిపాజిట్లను నగదు రూపంలో చేయవచ్చు. అయితే రూ. 1 లక్ష కంటే ఎక్కువ మొత్తాన్ని చెక్కు ద్వారా చెల్లించాలి.
రిటైర్మెంట్ తర్వాత ప్రత్యేక SCSS ఖాతాలను తెరవడం ద్వారా గరిష్ట ప్రయోజనాలను పొందవచ్చు. తద్వారా వారి పెట్టుబడి పరిమితిని రూ.60 లక్షలకు రెట్టింపు చేయవచ్చు. ఇది త్రైమాసిక వడ్డీ రూ.1,20,300 వార్షిక ఆదాయం రూ. 4,81,200. ఐదు సంవత్సరాల మెచ్యూరిటీ వ్యవధిలో ఇది మొత్తం రూ. 24,06,000 వడ్డీని పొందవచ్చు.
నెలకు 20 వేల రూపాయలు ఎలా పొందాలి పదవీ విరమణ చేసిన తర్వాత అతని SCSS ఖాతాలో ఏకంగా రూ. 30 లక్షలు జమ చేశాడు అనుకుంటే..త్రైమాసిక వడ్డీ: రూ. 60,150 అందుబాటులో ఉంటుంది. వార్షిక వడ్డీ: ₹ 2,40,600 అందుబాటులో ఉంటుంది. ఐదు సంవత్సరాలలో పొందవలసిన మొత్తం వడ్డీ: ₹12,03,000. మొత్తం మెచ్యూరిటీ మొత్తం: ₹42,03,000. అంటే ప్రతి మూడు నెలల తర్వాత ₹ 60,150 అతని ఖాతాకు వస్తుంది. దీన్ని మూడు భాగాలుగా విభజించడం ద్వారా నెలకు రూ.20 వేలు సులభంగా పెన్షన్ పొందవచ్చు.
SCSS వార్షిక వడ్డీ రేటు 8.2% అందిస్తుంది, ఇది సుకన్య సమృద్ధి యోజనతో పాటు అత్యధికంగా చెల్లించే చిన్న పొదుపు పథకం. ఖాతాదారులకు అదనపు పొదుపులను అందించే ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద డిపాజిట్లు పన్ను మినహాయింపుకు అర్హులు. ప్రభుత్వం మద్దతుతో, ఈ పథకం డిపాజిట్ చేసిన మొత్తానికి 100శాతం భద్రతను అందిస్తుంది.