Ar rahman controversy on chhaava: చావా సినిమా ప్రస్తుతం ఆల్ టైమ్ రికార్డులను క్రియేట్ చేస్తుంది. థియేటర్ కు వచ్చిన అభిమానులు నినాదాలు చేస్తు, ఎమోషన్ కు గురౌతున్నారు.ఈ తరుణంలో ఏఆర్ రెహమాన్ వివాదం ప్రస్తుతం తెరమీదకు వచ్చింది.
మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా చావా తెరకెక్కింది. ఈ సినిమాకు.. లక్ష్మణ్ ఉటేకర్ చావాకు దర్శకత్వం వహించారు. అంతేకాకుండా.. బాలీవుడ్ నటుడు విక్కి కౌశాల్ శంభాజీ మహారాజ్ పాత్రలోను, శంభాజీ సతీమణి యేసుబాయ్ పాత్రలో రష్మిక నటించారు.
ఈ సినిమా ఫిబ్రవరి 14న రిలీజ్ అయిన విషయంతెలిసిందే. విడుదల రోజు నుంచి చావా ప్రతిరోజు రికార్డులను క్రియేట్ చేస్తునే ఉంది. ఈ మూవీలోని ప్రతి సీన్, ఎలివేషన్స్ కూడా గూస్ బంప్స్ తెప్పించేవిగా ఉన్నాయి. ముఖ్యంగా శంభాజీ మహారాజ్ సింహాంతో పోరాడటం, మొఘల్స్ కుతంత్రాల్ని తిప్పికొట్టడం వంటి సీన్ లు ఈ మూవీకి హైలేట్ గా నిలిచాయి.
చావా క్లైమాక్స్ లో.. శంభాజీ మహారాజ్ కట్టేసి చిత్ర హింసలు పెట్టిన కూడా.. ఆయన మొఘల్స్ ముందు తల వంచ కుండా.. చివరి వరకు కూడా స్వరాజ్యం కోసమే గట్టిగా నిలబడి.. మా జగదంబే అంటూ చేసిన నినాదాలు.. అభిమానుల్ని కంటతడి పెట్టించేవిగా ఉన్నాయని చెప్పుకొవచ్చు.
ఇదిలా ఉండగా..ఎక్కడ చూసిన కూడా చావా గురించి ప్రస్తుతం చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఒకవైపు చావాలో విక్కి కౌశాల్, రష్మిక మందన్న పాత్రలు అద్భుతంగా ఉన్నాయంటున్నారు. కానీ ఏఆర్ రెహమాన్ సంగీతం విషయంలో మాత్రం అభిమానులు తెగ ట్రోల్స్ చేస్తున్నారు.
చావాలో సీన్ లకు తగ్గట్టుగా విక్కి కౌశాల్ ఒక రేంజ్ లో హావా భావాలు చూపించాడు.కానీ దానికి తగ్గట్టుగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, బీజీఎం మాత్రం లేదని అభిమానులు మండిపడుతున్నారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజీక్ సీన్లను ఇంకా ఎక్కువగా ఎలివేట్ చేస్తుందని అభిమానులు అంటున్నారు. కానీ ఏఆర్ రెహామాన్ ఏదో మొక్కుబడిగా దీనికి సంగీతం అందించినట్లు ఉందని చాలా మంది సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు.
మరికొందరు ఒక అడుగు ముందుకేసి.. ఇది మొఘల్స్ కు వ్యతిరేకంగా తీసిన హిందు సినిమా.. కాబట్టి.. ఏ ఆర్ రెహామాన్ తన బుద్ది చూపించాడని కూడా ఏకీ పారేస్తున్నారు. ఒక సినిమాను అందించే సంగీతం విషయంలో ఇలా చేయకూడదని.. చావా కు నిజమైన విలన్ ఔరంగా జేబు మాత్రమే కాదని.. ఏఆర్ రెహమాన్ కూడా అంటూ.. కొంత మంది మండిపడుతున్నారు.
ఈ క్రమంలో ఏఆర్ రెహమాన్ అనేక హిట్ సినిమాలకు సంగీతం అందించాడు. ఆయన ఆస్కార్ వరకు మన సినిమాలు వెళ్లేలా చేశాడు. అలాంటి గొప్ప సంగీత దర్శకుడిని పట్టుకుని ఇలాంటి లేనీపోనీవి ఆపాదించకూడదని మరికొందరు కౌంటర్ లు సైతం వేస్తున్నారు. ఈ క్రమంలో ఈ కాంట్రవర్సీతో ఏఆర్ రెహామాన్ మాత్రం ప్రస్తుతం వార్తలలో నిలిచారు.