Best Mileage Bike: అత్యంత తక్కువ ధరలోనే ఎక్కువ మైలేజీని అందించే బైక్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఈ మోటర్‌సైకిల్స్ అత్యంత తక్కువ ధరలోనే ఎక్కువ మైలేజీతో లభిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Best Mileage Bike for Office Going In Telugu: భారత మార్కెట్‌లోకి ఎప్పటికప్పుడు కొత్త స్కూటర్స్ విడుదలవుతూనే ఉన్నాయి. ప్రస్తుతం చాలా మంది ఎక్కువగా మైలేజీని అందించే బైక్స్‌ను మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. అయితే మీరు కూడా ఎప్పటి నుంచో మంచి మోటర్‌సైకిల్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే మీ కోసం అద్భుతమైన మోటర్‌సైకిల్స్‌ను పరిచయం చేయబోతున్నాం.. ఈ బైక్స్ అద్భుతమైన మైలేజీని కలిగి ఉండడమే కాకుండా అతి తక్కువ ధరలోనే లభించనున్నాయి. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ గతంలో విడుదల చేసిన బజాజ్ CT 110 X బైక్ అద్భుతమైన మైలేజీతో అందుబాటులోకి వచ్చింది. ఇది లీటర్ పెట్రోల్‌కి దాదాపు 70 కిలోమీటర్ల మైలేజీని అందించబోతున్నట్లు కంపెనీ తెలిపింది. దీని ధర మార్కెట్‌లో రూ.68,328తో లభిస్తోంది.
అత్యంత తక్కువ ధరలో ప్రీమియం డిజైన్‌లో కలిగి మోటర్‌సైకిల్స్‌లో బజాజ్ ప్లాటినా బైక్ ఒకటి.. ఇది లీటరుకు 70 కిలోమీటర్ల మైలేజీని అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. అంతేకాకుండా దీని ధర రూ. 68,890 (ఎక్స్-షోరూమ్) ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
ఎక్కువగా మైలేజీ అందించే మోటర్‌సైకిల్స్‌లో టీవీఎస్ రేడియన్ ఒకటి.. ఇది అత్యంత తగ్గింపు ధరతో లభిస్తోంది. ఇది లీటర్‌కి 71.33 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. దీని ధర రూ.87,888 (ఎక్స్-షోరూమ్)తో లభిస్తోంది.
ప్రస్తుతం మార్కెట్‌లో ఈ హీరో స్ప్లెండర్ ప్లస్ స్కూటర్ ధర రూ.77,026 నుంచి ప్రారంభమవుతుంది. అయితే దీని మైలేజీ లీటర్‌కు 70 నుంచి 80.6 kmpl ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం మార్కెట్‌లో యమహా రేజెడ్ఆర్ 125 మోటర్‌సైకిల్ ధర రూ. 87,888తో లభిస్తోంది. అలాగే ఇది లీటర్‌కు దాదాపు 71.33 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. దీంతో పాటు ఈ మోటర్‌సైకిల్ అద్భుతమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది.