LSG vs PBKS IPL 2023 Match 21 Dream11 Team Prediction: ఐపీఎల్ 2023లో మరో మ్యాచ్‌కు రంగం సిద్ధం అయింది. లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడేందుకు సిద్ధంగా ఉన్నాయి. లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో ఈరోజు రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ప్రస్తుతం జోరుమీదున్న లక్నో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉండగా.. పంజాబ్ ఐదో స్థానంలో ఉంది. ఇరు జట్లు కూడా మరో విజయం కోసం చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్లేయింగ్ ఎలెవన్, డ్రీమ్ 11 టీమ్‌ను ఓసారి చూద్దాం.
ఆరంభంలో మ్యాచ్‌లలో మెరిసిన లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్ కైల్ మేయర్స్.. వరుసగా గత రెండు మ్యాచ్‌లలో విఫలమయ్యాడు. దీంతో నేటి మ్యాచ్‌లో పక్కన పెట్టే అవకాశం ఉంది. మేయర్స్ స్థానంలో క్వింటన్ డీకాక్ ఆడే అవకాశం ఉంది. మార్కస్ స్టొయినిస్, నికోలస్ పూరన్ ఫామ్‌లో ఉండడం కలిసొచ్చే అంశం. కెప్టెన్ కేఎల్ రాహుల్ దీపక్ హుడా రాణించాల్సి ఉంది. ఇక అవేష్ ఖాన్, మార్క్ వుడ్, రవి బిష్ణోయ్ బౌలింగ్ విభాగంలో చెలరేగనున్నారు.
పంజాబ్ ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ వరుసగా రెండు డక్‌లు అయ్యాడు. దూకుడుగా ఆడే అతనికి మరో ఛాన్స్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. లియామ్ లివింగ్‌స్టోన్ ఇంకా పూర్తి ఫిట్‌గా లేకపోవడంతో సికందర్ రజాను కొనసాగించే అవకాశం ఉంది. భానుక రాజపక్స ఆడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. శిఖర్ ధావన్, మాథ్యూ షార్ట్, జితేష్ శర్మ రాణించాల్సిన అవసరం ఉంది. హర్‌ప్రీత్ బ్రార్, కగిసో రబడ, అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌పై ఢిల్లీ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.
తుది జట్లు (అంచనా):
లక్నో: కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డీకాక్, దీపక్ హుడా, మార్కస్ స్టొయినిస్, నికోలస్ పూరన్, కృనాల్ పాండ్యా, కృష్ణప్ప గౌతమ్, మార్క్ వుడ్, ఆవేష్ ఖాన్, యష్ ఠాకూర్, రవి బిష్ణోయ్.
పంజాబ్: ప్రభ్‌సిమ్రాన్ సింగ్, శిఖర్ ధవన్ (కెప్టెన్), మాథ్యూ షార్ట్, భానుక రాజపక్స, జితేశ్ శర్మ, సామ్ కర్రాన్, షారుఖ్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చహర్, కగిసో రబాడ, అర్షదీప్ సింగ్.
డ్రీమ్ 11 టీమ్:
కీపర్ - నికోలస్ పూరన్
బ్యాట్స్‌మెన్ - శిఖర్ ధావన్, భానుకా రాజపక్స, లోకేష్ రాహుల్ (వైస్ కెప్టెన్)
ఆల్ రౌండర్లు - మార్కస్ స్టోయినిస్, కైల్ మేయర్స్, సామ్ కుర్రాన్
బౌలర్లు - మార్క్ వుడ్ (కెప్టెన్), అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, కగిసో రబాడ.
Also Read: Jio Cinema Charges: జియో సినిమాకు ఇకపై డబ్బులు చెల్లించాల్సిందే.. ఐపీఎల్ 203 మాత్రం..!
Also Read: Harry Brook Century: చరిత్ర సృష్టించిన హ్యారీ బ్రూక్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ చరిత్రలో 'ఒకే ఒక్కడు'!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.