H3N2 Cases: విజృంభిస్తున్న హెచ్‌3ఎన్‌2.. మరో ఇద్దరు మృతి

H3N2 Deaths in India: ఇన్‌ఫ్లుయెంజా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో 361 ఇన్‌ఫ్లుయెంజా ఇన్‌ఫెక్షన్ కేసులు నమోదవడంతోపాటు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. మరో రెండు రోజుల్లో మార్గదర్శకాలు జారీ చేసేందుకు రెడీ అవుతోంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 16, 2023, 01:41 AM IST
H3N2 Cases: విజృంభిస్తున్న హెచ్‌3ఎన్‌2.. మరో ఇద్దరు మృతి

H3N2 Deaths in India: కరోనా మహమ్మారి నుంచి కోలుకుని ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో ఇన్‌ఫ్లుయెంజా పంజా విసురుతోంది. హెచ్‌3ఎన్‌2 వైరస్ కేసులు రోజురోజుకు పెరుగుతుండగా.. మహారాష్ట్రలో ఇద్దరు మృతి చెందారు. వీరిలో ఒకరు 74 ఏళ్ల వ్యక్తి హెచ్‌3ఎన్‌2 సబ్‌టైప్‌తో మరణించగా.. మరో బాధితుడు (23) కరోనా వైరస్, ఇన్‌ఫ్లుయెంజాతో ప్రాణాలు కోల్పోయాడు. మహారాష్ట్రలో 361 ఇన్‌ఫ్లుయెంజా ఇన్‌ఫెక్షన్ కేసులు నమోదయ్యాయని.. మరో రెండు రోజుల్లో మార్గదర్శకాలు జారీ చేస్తామని ఆరోగ్య శాఖ వెల్లడించిది.

ఇన్‌ఫ్లుయెంజా కారణంగా రాష్ట్రంలో ఇద్దరు చనిపోయారని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తానాజీ సావంత్ బుధవారం అసెంబ్లీలో తెలిపారు. వీరిలో ఒకరు హెచ్3ఎన్2 సబ్‌టైప్‌తో మరణించారని.. మరొక బాధితుడు కరోనా వైరస్‌తో పాటు ఇన్‌ఫ్లుయోంజా వైరస్ బారిన పడ్డాడని ఆయన చెప్పారు. రద్దీగా ఉండే ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని.. సామాజిక దూరం పాటించాలని మంత్రి సూచించారు. అహ్మద్‌నగర్‌లో 23 ఏళ్ల MBBS విద్యార్థితో సహా ఇద్దరు వ్యక్తులు ఇన్‌ఫ్లుఎంజా కారణంగా మరణించారని మంత్రి తెలిపారు. విద్యార్థికి కోవిడ్-19తో పాటు హెచ్1ఎన్1, హెచ్3ఎన్2 వైరస్ సోకిందన్నారు. హెచ్‌1ఎన్‌1, హెచ్‌3ఎన్‌2 అనే రెండు రకాల వైరస్‌ల వల్ల ఇన్‌ఫ్లుయెంజా వస్తుందని.. మరో రెండు రోజుల్లో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేతో సవివరంగా చర్చించిన తర్వాత మార్గదర్శకాలు జారీ చేస్తామని మంత్రి తెలిపారు.

మరోవైపు కేంద్ర పాలితం పుదుచ్చేరిలో హెచ్3ఎన్‌2 ఇన్‌ఫ్లుయెంజా వైరస్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రభుత్వం బుధవారం నుంచి ఈ నెల 26వ తేదీ వరకు 8వ తరగతి వరకు అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించింది. ఉత్తరప్రదేశ్‌లో హెచ్‌3ఎన్2 ఇన్‌ఫ్లుయెంజా కేసులపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్ని జిల్లాల్లో అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖకు ఆదేశించారు. ప్రతి జిల్లాలో హెచ్‌3ఎన్‌2 రోగులపై రోజువారీ పర్యవేక్షణ చేయాలని సూచించారు. మంగళవారం అస్సాంలో హెచ్3ఎన్2 కేసు నమోదైనట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
 
తమిళనాడులో హెచ్‌3ఎన్‌2 భయంతో తొమ్మిదో తరగతి వరకు విద్యార్థులకు సెలవులు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోందని.. అదంతా ఫేక్ అని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి మా సుబ్రమణియన్ బుధవారం ప్రకటించారు. హెచ్‌3ఎన్‌2 కేసుల పెరుగుదల కారణంగా పొరుగున ఉన్న పుదుచ్చేరిలో 8వ తరగతి వరకు విద్యార్థులకు సెలవు ప్రకటించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తమిళనాడులో హెచ్‌3ఎన్‌2 కేసులు ఎక్కువగా లేవని.. పుకార్లు వ్యాప్తి చెందవద్దని సూచించారు. జ్వరం, ఇన్‌ఫ్లుఎంజాతో బాధపడుతున్న వ్యక్తులు సెల్ఫ్ క్వారంటైన్ విధించుకోవాలని.. మాస్కులు ధరించాలని సూచించారు. ఇతరుల నుంచి సామాజిక దూరం పాటించాలని కోరారు.  

Also Read: IPL 2023: ఐపీఎల్ ప్రారంభానికి ముందు ఆర్‌సీబీకి షాక్.. కీలక ప్లేయర్ ఔట్..!  

Also Read: Rishabh Pant: క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్.. పంత్ లేటెస్ట్ వీడియో చూశారా..!  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News