Rain Alert In Telangana And Andhra Pradesh: ఈ ఏడాది ప్రారంభం నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. చాలా రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల సెల్సియస్ నమోదవుతున్నాయి. ఎండలు దంచి కొడుతుండటంతో ప్రజలు పని ఉంటే తప్ప పెద్దగా బయట తిరగడం లేదు. వేడి తాపానికి అల్లాడుతున్న జనాలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రానున్న ఐదు రోజులుపాటు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. పశ్చిమ డిస్ట్రబెన్స్ కారణంగా మార్చి 17 వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. .
ఏయే రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయంటే..
పంజాబ్, రాజస్థాన్ మరియు గుజరాత్ రాష్ట్రాల్లో మార్చి 14 వరకు... తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తూర్పు గుజరాత్, ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌లో మార్చి 17 వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. దేశ రాజధాని డిల్లీలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే పశ్చిమ డిస్ట్రబెన్స్ కారణంగా అక్కడ కూడా మేఘావృత వాతావరణం నెలకొంది.
తెలంగాణకు భారీ వర్ష సూచన!
తెలంగాణలో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు గాలులు వీచే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అవి గంటకు 30 నుండి 40 కిలో మీటర్ల వేగంతో వీచే ఛాన్స్ ఉన్నట్టు ప్రకటించింది. ముఖ్యంగా అదిలాబాద్, కొమరం భీమ్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్ బాద్, వరంగల్, హన్మ కొండ జిల్లాలలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలకు రావచ్చని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఈ గాలులు తూర్పు, ఆగ్నేయ దిశల నుండి రాష్టం మీదకు వీస్తున్నాయి.రాష్ట్రానికి వర్షాలు వచ్చే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నెల 15, 16,17 వ తేదీలలో తేలిక పాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది.
Also Read: Old Pension Scheme: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్.. ఆ రోజే లాస్ట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.