Navratri Lucky Zodiac Sign: హిందూ మతంలో నవరాత్రులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. సంవత్సరానికి నాలుగు సార్లు నవరాత్రులు జరుపుకుంటారు. అవే చైత్ర, శారదీయ మరియు గుప్త నవరాత్రులు. చైత్ర మాసంలోని శుక్ల పక్షం ప్రతిపాద తేదీ నుండి చైత్ర నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఈసారి చైత్ర నవరాత్రులు ఏప్రిల్ 22న మెుదలై..మార్చి 30న ముగుస్తాయి. నవరాత్రుల తొమ్మిది రోజులు దుర్గామాత యెుక్క తొమ్మిది రూపాలను పూజిస్తారు. ఈరోజున దుర్గామాతను పూజిస్తే మీ యెుక్క ప్రతి కోరిక నెరవేరుతుంది. మరి ఈ నవరాత్రులు ఏ రాశులవారికి కలిసిరానున్నాయో తెలుసుకుందాం.
నవరాత్రులు ఈ రాశులకు వరం
మేషరాశి
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, నవరాత్రులలో ఏర్పడిన ప్రత్యేక యోగం మేషరాశి వారి జీవితంలో విశేష ప్రయోజనాలను ఇస్తుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. అనారోగ్యం నుండి బయటపడతారు. మీపై దుర్గాదేవి ప్రత్యేక ఆశీస్సులు ఉంటాయి.
పరిహారం- ఈసారి నవరాత్రులలో అఖండ జ్యోతిని వెలిగించి దుర్గా సప్తశతి పఠించండి.
వృషభం
నవరాత్రులు ఈ రాశులవారికి చాలా శుభప్రదంగా భావిస్తారు. విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారు. పదోన్నతి పొందే అవకాశం ఉంది. మీరు ఏ పనిచేపట్టినా దానిని విజయవంతంగా పూర్తిచేస్తారు. ఉద్యోగ, వ్యాపారులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.
సింహరాశి
చైత్ర నవరాత్రుల సమయం ఈ రాశి వారికి చాలా ప్రత్యేకంగా ఉండబోతున్నాయి. ఉద్యోగం సాధించాలనే కోరిక నెరవేరుతుంది. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది పెళ్లికాని వారికి వివాహం కుదిరే అవకాశం ఉంది.
తులారాశి
చైత్ర నవరాత్రులలో మీరు కొన్ని శుభవార్తలు వింటారు. ఈ సమయంలో కొత్త జాబ్ ఆఫర్ పొందుతారు. మీరు ఇతరులతో మంచి సంబంధాలు ఏర్పరుచుకుంటారు. తులరాశి వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.
Also Read: Grah Gochar: చైత్రమాసంలో పంచగ్రహాల కలయిక.. ఈ రాశులకు లాటరీ పక్కా.. ఇందులో మీ రాశి ఉందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
చైత్ర నవరాత్రుల్లో ఈరాశుల వారు అదృష్టవంతులు.. ఇందులో మీరున్నారా?