Ram Charan- Narthan movie is on hold: రామ్ చరణ్ హీరోగా ప్రస్తుతానికి తన 15వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న తర్వాత రామ్ చరణ్ తేజ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మాణంలో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తన 16వ సినిమా చేస్తున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించాడు.
వాస్తవానికి ఈ సినిమా ప్రకటించక ముందే గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఆయన 16వ సినిమా ఉంటుందని అధికారికంగా ప్రకటించారు. కానీ గౌతం తిన్ననూరి సబ్జెక్ట్ కరెక్ట్ కాదని భావించిన రాంచరణ్ దాన్ని పక్కన పెట్టడంతో పాటు బుచ్చిబాబు సానా సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. ఆ సంగతి అలా ఉంచితే రామ్ చరణ్ కన్నడ దర్శకుడు నారదన్ సబ్జెక్టుకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. ఇంకేముంది కన్నడ దర్శకుడు నారదన్ దర్శకత్వంలో తెలుగు హీరో రామ్ చరణ్ నటిస్తున్నారనే వార్త నిజమే అని దాదాపు అందరూ ఫిక్స్ అయిపోయారు.
అయితే ఇక తాజాగా అందుతున్న సమాచారం మేరకు రామ్ చరణ్ హీరోగా నారదన్ డైరెక్టర్‌గా తెరకెక్కాల్సిన ప్రాజెక్ట్ ప్రస్తుతానికి హోల్డ్ లో పెట్టారని యువి క్రియేషన్స్ నిర్మించాల్సిన ఈ సినిమా ఫైనల్ స్క్రిప్ట్ రామ్ చరణ్ ను మెప్పించలేదని అంటున్నారు. ఇటీవల నారదన్ వచ్చి రామ్ చరణ్ కి నేరేషన్ ఇచ్చినప్పుడు అది రామ్ చరణ్ కు నచ్చలేదని అందుకే ప్రస్తుతానికి ఆ సినిమాని హోల్డ్ లో పెట్టారు అనే ప్రచారం అయితే పెద్ద ఎత్తున టాలీవుడ్ వర్గాల్లో జరుగుతోంది.
ఇందులో నిజా నిజాలు ఎంతవరకు ఉన్నాయి అనే విషయం మీద క్లారిటీ లేదు. కానీ ప్రస్తుతానికైతే ఆ ప్రాజెక్టు హోల్డ్ లో పెట్టారని, వీలైనంత త్వరలో దాన్ని తెరకెక్కించాలా లేక పూర్తిగా పక్కన పెట్టాలా అనే విషయం మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. చూడాలి మరి ఏం జరగబోతోంది అనేది.
Also Read: Trivikram Cooking: ఇంట్లో వంట త్రివిక్రమే చేస్తాడా.. అరెరే ఇలా బయట పెట్టేశాడు ఏంటి?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook