హిందువులు అత్యంత పవిత్రంగా, మహత్యమైందిగా భావించే విజయ ఏకాదశి ఇవాళే. ఫిబ్రవరి 16వ తేదీ విజయ ఏకాదశి అంటే ప్రత్యర్ధులపై సైతం విజయం లభించే రోజు. విజయ ఏకాదశి కొన్ని రాశులవారికి అత్యంత శుభప్రదంగా ఉండనుంది. కొన్ని విషయాల్లో విజయం సాధిస్తారు కూడా.
హిందూమతం ప్రకారం విజయ ఏకాదశిని అత్యంత శుభదినంగా భావిస్తారు. శ్రీరాముడు సైతం లంకపై విజయానికి ముందు విజయ ఏకాదశి వ్రతం ఆచరించాడని ప్రతీతి. ఇవాళ అంటే ఫిబ్రవరి 16వ తేదీన విజయ ఏకాదశి వ్రతం ఆచరిస్తే ప్రత్యర్ధులపై విజయం లభించడమే కాకుండా జీవితంలో అంతులేని సుఖ సంతోషాలు లభిస్తాయి. ఈ జాతకం వారిపై విష్ణువు కటాక్షం ఉండటంతో ప్రతి పనిలో విజయం లభిస్తుంది.
విజయ ఏకాదశి అంటే ఇవాళ ఏ రాశులకు శుభసూచకం
మేష రాశి
మేషరాశికి ఇవాళ చాలా మంచి రోజు. ఈ రాశివారి కోర్కెలు నెరవేరుతాయి. శుభవార్తలు వింటారు. అయితే అత్యుత్సాహం ప్రదర్శిస్తే అసలుకే నష్టం కావచ్చు. అప్రమత్తంగా ఉండాలి. కుటుంబ సభ్యులకు సమయం కేటాయించాలి. ఈ రోజంతా బాగుంటుంది.
వృషభరాశి
షేర్ మార్కెట్ వ్యాపారం చేసేవారికి మంచి రోజు. రిస్క్‌తో కూడుకున్న షేర్ మార్కెట్‌లో మంచి లాభాలు ఆర్జించవచ్చు. జీవిత భాగస్వామి సహాయం లభిస్తుంది. అందరూ మీ పనుల్ని ప్రశంసిస్తారు. కెరీర్‌కు చాలా అనుకూలమైన రోజు. కొత్త డీల్స్ లభించవచ్చు.
కర్కాటక రాశి
ఇవాళ అంటే విజయ ఏకాదశి కర్కాటక రాశివారికి చాలా మంచిది. ఇవాళ బయట తిరిగేందుకు జీవితాన్ని ఎంజాయ్ చేసేందుకు అనువైంది. ఇళ్లు ఆఫీసు కాకుండా బయటి ప్రపంచం కూడా చూసి నేర్చుకోవల్సింది చాలా ఉంది. వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది.
తులా రాశి
ఇవాళ్టి రోజు ఈ రాశివారికి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. రాజకీయాల్లో ఉండేవారికి సాఫల్యత ఉంటుంది. వివిధ కార్యక్రమాల్లో రాణిస్తారు. సుఖవంతమైన ప్రయాణాలు చేస్తారు. కెరీర్ కోసం ఇవాళ చాలా మంచిది. ఇవాళ ఎక్కువగా కష్టపడాల్సి వచ్చినా..అందుకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది.
మకర రాశి
ఇవాళ విజయ ఏకాదశి మీకు చాలా ఆనందమయమై ఉంటుంది. వ్యాపార రీత్యా చాలా లాభాలు కలుగుతాయి. ఉద్యోగం చేసేవారికి లాభాలుంటాయి. అయితే ఆరోగ్యరీత్యా అప్రమత్తంగా ఉండాలి. మల్టీ నేషనల్ కంపెనీల్లో ఆఫర్లు వస్తాయి.
Also read : Venus Transit 2023: శుక్రుడి మీనరాశి గోచారం, ఈ 4 రాశులకు రానున్న 25 రోజులు తీవ్ర అప్రమత్తత అవసరం, లేకపోతే...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Vijaya Ekadashi 2023: విజయ ఏకాదశి ఫిబ్రవరి 16 ఈ 5 రాశులకు ఇవాళ తిరుగే ఉండదు