Nijam with Smita in Sony liv Promo: దాదాపు ఇప్పటికే ఉన్న దేశ, విదేశీ ఓటీటీ సంస్థలన్నీ తెలుగు కంటెంట్ మీద ఫోకస్ పెడుతున్నాయి. కేవలం తెలుగు కంటెంట్ అనే కాదు రీజనల్ అంటే తమిళ, కన్నడ, మలయాళం భాషల కంటెంట్ మీద కూడా ఫోకస్ పెడుతున్నారు. అదే బాటలో సోనీ లీవ్ ఓటీటీ ప్లాట్ ఫారం కూడా తెలుగు కంటెంట్ సహా మలయాళ కంటెంట్ మీద ఎక్కువగా దృష్టి కేంద్రీస్తోంది.
ఇందులో భాగంగా సింగర్ స్మితతో ఒక టాక్ షో సిద్ధం చేశారు. దాదాపుగా ఈ టాక్స్ షో కి సంబంధించి మొదటి సీజన్ కి సరిపడా ఎపిసోడ్ల షూటింగ్ ఇప్పటికే పూర్తికాగా ఇప్పుడు ఈ షోకి సంబంధించిన అధికారిక ప్రకటన చేస్తూ ఒక ప్రోమో సైతం రిలీజ్ చేశారు. నిజం విత్ స్మిత అనే పేరుతో టెలికాస్ట్ కాబోతున్న ఈ షోకి సంబంధించి ఒక చిన్న ప్రోమో విడుదల చేశారు సోనీ లీవ్ నిర్వాహకులు.
ఇక ఈ ప్రోమోలో సినిమాలతో పాటు రాజకీయ అంశాలను సైతం స్మిత ఈ టాక్ షోలో స్పృశిస్తున్నట్లుగా కనిపిస్తోంది. సినీ నటుడు నాని- దగ్గుబాటి రానా ఒక ఎపిసోడ్ లో, సాయి పల్లవి ఒకే ఎపిసోడ్లో, రాధిక సహా మరికొందరు మహిళా నటీమణులు ఒకే ఎపిసోడ్లో, చంద్రబాబు ఒక ఎపిసోడ్లో, బిజెపి జాతీయ నేత రామ్ మాధవ్ ఒకే ఎపిసోడ్లో కనిపిస్తున్నారు. అదే విధంగా నాని నెపోటిజం మీద చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
రామ్ చరణ్ చేసిన మొదటి సినిమా చిరుతని కోటి మంది చూశారు అంటే ఆ కోటి మంది నెపోటిజంని ఎంకరేజ్ చేస్తున్నట్లే కదా అన్నట్లుగా నాని కామెంట్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలోకి వచ్చి హీరోగా ఉన్న నానిని నెపోటిజం గురించి ప్రశ్నించడం ద్వారా స్మిత ఈ కార్యక్రమం ద్వారా అనేక సంచలన విషయాలను వెలుగులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారనే సంకేతాలు పంపినట్లు అవుతోంది. స్మిత తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఆ ప్రోమో మీద మీరు కూడా ఒకసారి లుక్కేయండి మరి.
Also Read: Nayanthara Casting Couch: 'నయనతార'నూ వదలలేదు.. క్యాస్టింగ్ కౌచ్ అనుభవం బయటపెట్టేసింది!
Also Read; Pawan Kalyan Unstoppable: పవన్ ఎపిసోడ్ కోసం స్పెషల్ టీములు.. దిల్ రాజును వాడుకుంటూ ఆహా ప్రమోషన్స్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.