Tollywood Director Sagar Died: టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది, ప్రముఖ దర్శకుడు సాగర్ అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. తెలుగులో అనేక సినిమాలకు దర్శకత్వం వహించిన ఆయన ప్రస్తుతం చెన్నైలో నివాసం ఉంటున్నారు. చెన్నై నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచినట్లుగా తెలుస్తోంది. తెలుగులో 40కి పైగా సినిమాలుకు దర్శకత్వం వహించిన సాగర్ స్టువర్టుపురం దొంగలు, అమ్మదొంగ వంటి సినిమాలతో మంచి హిట్ అందుకున్నారు.
తెలుగు సినిమా దర్శకుల సంఘానికి మూడుసార్లు అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన దగ్గర శిక్షణ పొందిన వివి వినాయక్, శ్రీనువైట్ల, రవికుమార్ చౌదరి వంటి వారు దర్శకులుగా రాణించారు. సాగర్ పూర్తి పేరు విద్యాసాగర్ రెడ్డి, ఆయన మంగళగిరి దగ్గర నిడమర్రు అనే గ్రామంలో జన్మించారు. మద్రాసులో చదువులు బాగుంటాయి అనే ఉద్దేశంతో ఆయన చిన్నప్పుడే కుటుంబం మద్రాసు కు మకాం మార్చింది.
అక్కడే చదువు పూర్తి చేసుకున్న సాగర్ అట్లూరి పుండరీకాక్షయ్య కుమారుడి స్నేహితుడు కావడంతో ఈజీగానే సినీ రంగ ప్రవేశం దొరికింది. దర్శకత్వ శాఖలో చేసిన ఆయన కృష్ణను డైరెక్ట్ చేయబోయి ముందుగా నరేష్ తో సినిమా చేశారు. రాకాసి లోయ అనే సినిమాతో దర్శకుడిగా మారిన ఆయన తర్వాత తన కెరీర్ లో దాదాపు 40 సినిమాలకు దర్శకత్వం వహించారు. ముఖ్యంగా ఖైదీ బ్రదర్స్, యాక్షన్ నెంబర్ వన్, అన్వేషణ, అమ్మదొంగ, రామసక్కనోడు, ఓసి నా మరదలా, స్టువర్టుపురం దొంగలు, డాకు వంటి సినిమాలతో ఆయన మంచి హిట్స్ అందుకున్నాడు.
చిరంజీవి హీరోగా నటించిన స్టువర్టుపురం పోలీస్ స్టేషన్ విడుదలైన వారం రోజుల్లోనే రిలీజ్ చేసి మరీ స్టువర్టుపురం దొంగలు అనే సినిమాతో సాగర్ సూపర్ హిట్టు అందుకున్నాడు. ఆయనకు అసభ్యతకు తావు లేకుండా అన్ని సినిమాలను కుటుంబ కథ చిత్రాలుగా తెరకెక్కిస్తారని పేరు ఉంది. సాగర్ మృతి చెందారని విషయం తెలుసుకున్న ఆయన శిష్యులు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు
Also Read: Planadu Gun Firing: పల్నాడు జిల్లాలో కాల్పుల కలకలం.. టీడీపీ మండలాధ్యక్షుడికి బుల్లెట్ గాయాలు! పరిస్థితి విషమం
Also Read: Hyderabad: హైదరాబాద్‌లో మరో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.