DRC Boat Accident: డీఆర్‌సీలో ఘోర ప్రమాదం.. పడవ మునిగి 145 మంది మృతి!

145 people dead after Congo boat sinking. డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. లులోంగా నదిలో 200 మంది ప్రయాణికులతో వెళ్తున్న మోటారు బోటు ఒక్కసారిగా మునిగిపోయింది.   

Written by - P Sampath Kumar | Last Updated : Jan 20, 2023, 04:51 PM IST
  • డీఆర్‌సీలో ఘోర ప్రమాదం
  • పడవ మునిగి 145 మంది మృతి
  • ప్రాణాలతో బయటపడ్డ 55 మంది
DRC Boat Accident: డీఆర్‌సీలో ఘోర ప్రమాదం.. పడవ మునిగి 145 మంది మృతి!

DRC Boat Accident, 145 people dead in Congo Boat Sinking: డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (డీఆర్‌సీ)లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. లులోంగా నదిలో 200 మంది ప్రయాణికులతో వెళ్తున్న మోటారు బోటు ఒక్కసారిగా మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 145 మంది జల సమాధి అయ్యారు. మరో 55 మంది మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. లులోంగా నదిలో మోటారు బోటు ఓవర్ లోడు (సామర్థ్యానికి మించి ప్రయాణికులు)తో ప్రయాణించడం వలనే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం తెలుస్తోంది. ఇటీవల కాంగోలో తుఫాన్ కారణంగా కొండచరియలు విరిగిపడి చాలా మంది చనిపోయిన విషయం తెలిసిందే. 

మోటారు బోటులో ప్రయాణికులు తమ వస్తువులు, పశువులతో రిపబ్లిక్ ఆఫ్ కాంగో వెళ్తుండగా.. బసన్‌కుసు పట్టణం సమీపంలో మంగళవారం రాత్రి ప్రమాదం జరిగింది. పడవలో సామర్థ్యానికి మించి ప్రయాణికులు ఎక్కడం.. వస్తువులు, పశువులు కూడా ఉండటంతో అధిక బరువుతో పడవ నదిలో మునిగిపోయింది. ఈత రాని వారు నీటిలో మునిగి అక్కడిక్కడే మరణించారు. ఈత వచ్చిన వారు కూడా కొందరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో 145 మంది జల సమాధి కాగా.. 55 మంది ప్రాణాలతో బయటపడ్డారు. 

డీఆర్‌సీలో పడవ ప్రమాదాలు తరచుగా జరుగుతాయి. కాంగోలో రోడ్లు లేకపోవడంతో.. జనాలు పడవల్లో ప్రయాణిస్తుంటారు. అక్కడి ప్రజలు జీవనోపాధి కోసం నిత్యం ఇతర ప్రాంతాలకు వెళుతుంటారు. ఈత రాకపోయినా పడవల్లో ప్రయాణిస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు. ప్రమాద విషయం తెలిసి, రెస్క్యూ ఆపరేషన్ లేటుగా జరగడంతో మరణాల సంఖ్య పెరుగుతోంది. 2022 అక్టోబర్‌లో కాంగో నదిలో ఇలాంటి ఘటనే జరిగింది. పడవ మునిగి 40 మంది చనిపోయారు.

Also Read: Swiggy Lays Off: భారీ షాకిచ్చిన స్విగ్గీ.. 380 ఉద్యోగులు ఔట్!

Also Read: Shubman Gill: అలాంటి ఆటగాళ్లను కనుగొనడం చాలా కష్టం.. రోజర్ ఫెదరర్‌తో శుభమాన్ గిల్‌ను పోల్చిన సల్మాన్!  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

 

 

Trending News