Chiranjeevi is congress man says AP PCC Chief: "రాజకీయానికి నేను దూరమయ్యాను కానీ రాజకీయం నాకు దూరం కాలేదు" అంటూ గాడ్ ఫాదర్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి నోట ఒక డైలాగ్ పలికించారు మేకర్స్. అయితే అది సినిమాలో కథ ప్రకారం పలికించారు కానీ రాజకీయాలు మాత్రం ఇప్పుడు చిరంజీవిని వదలను అంటున్నాయి. తాజాగా వాల్తేరు వీరయ్య ప్రమోషన్స్ లో భాగంగా అనేక ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి తనకు రాజకీయాలతో సంబంధం లేదని ఆంధ్రప్రదేశ్ లో తనకు ఓటు కూడా లేదని చాలా స్పష్టంగా చెప్పారు.
కానీ చిరంజీవితో తమ రాజకీయ అనుబంధం ఇంకా కొనసాగుతోందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయ ఆరంగ్రేటం చేసిన చిరంజీవి తర్వాత జరిగిన పరిణామాలు నేపథ్యంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని తన పార్టీని సైతం కాంగ్రెస్ లో విలీనం చేశారు. కేంద్ర మంత్రిగా పని చేసిన చిరంజీవి రాష్ట్ర విభజన తర్వాత పార్టీకి రాజకీయాలకు దూరమయ్యారు. ఇది అందరికీ తెలిసిన మాటే కాకపోతే ఆయన పార్టీకి రాజీనామా చేయలేదట అందుకే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల సమయంలో కూడా చిరంజీవికి డెలిగేట్ అంటూ ఒక ఐడి కార్డు ఇచ్చామని పార్టీ నేతలు చెబుతున్నారు.
ఇప్పుడు మరోసారి చిరంజీవి కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా, రాహుల్ తో మంచి అనుబంధం కలిగి ఉన్నారంటూ ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్యనే పీసీసీ చీఫ్ గా నియమించబడిన రుద్రరాజు చిరంజీవి కాంగ్రెస్ లోనే ఉన్నారని, ఆయన ఇప్పటికీ సోనియా, రాహుల్ గాంధీతో చిరంజీవికి సత్సంబంధాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు.
2024 ఎన్నికల్లో కాంగ్రెస్ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని ఎవరితోనూ పొత్తు కూడా పెట్టుకోదని ఆయన స్పష్టం చేశారు. అయితే గిడుగు రుద్రరాజు చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిరంజీవి ఏమో తాను రాజకీయాల్లో యాక్టివ్గా లేనని తనకు రాజకీయాలు నప్పవు అని అర్థం చేసుకుని బయటకు వచ్చేసాను అని చెబుతుంటే వీరు మాత్రం ఇంకా కాంగ్రెస్ లోనే చిరంజీవి ఉన్నారంటూ చెప్పడం ఆసక్తికరంగా మారింది.
Also Read: Brahmaji Counter to Roja: ఏదీ నన్ను భయపెట్టలేదే?.. రోజాకు బ్రహ్మాజీ కౌంటర్!
Also Read: Vijay Antony Critical Stage: తీవ్ర విషమంగా విజయ్ అంటోనీ ఆరోగ్యం.. డాక్టర్లు ఏమంటున్నారంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook