ఎల్ఐసీ అందిస్తున్న జీవన్న ఆనంద్ పాలసీతో మీరు లక్షల రూపాయలు పొదుపు చేయవచ్చు. ఈ పాలసీలో మెచ్యూరిటీ అనంతరం 25 లక్షల రూపాయల వరకూ అందుకునే అవకాశముంది. జీవన్ ఆనంద్ పాలసీ వివరాలు మీ కోసం..
ఎల్ఐసీ జీవన్ ఆనంద్ అనేది దీర్ఘకాలిక సేవింగ్ ప్లాన్. డబ్బుల్ని ఎక్కువకాలం ఇన్వెస్ట్ చేయాలనుకునేవారి కోసం ఇది ఉపయోగపడుతుంది. రిటైర్మెంట్ ఫండ్‌ను క్రియేట్ చేయాలనుకుంటే ఇది మంచి ప్రత్యామ్నాయం. తక్షణం డబ్బులు అవసరం లేనివారికి ఉపయోగపడుతుంది. లాకింగ్ పీరియడ్ ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువ ప్రయోజనాలున్నాయి ఈ పాలసీలో. ఎల్ఐసీ జీవన్ ఆనంద్ పాలసీలో ఇన్వెస్టర్లకు ఇన్వెస్ట్మెంట్ బోనస్ లభిస్తుంది. పాలసీ హోల్డర్ చనిపోతే నామినీకు 125 శాతం డెత్ బెనిఫిట్ వర్తిస్తుంది. ఎల్ఐసీ జీవన్ ఆనంద్‌లో కనీస మొత్తం లక్ష రూపాయలుంది. గరిష్టంగా పరిమితి లేదు.
25 లక్షల మెచ్యూరిటీ నగదు కోసం ఎంత ఇన్వెస్ట్ చేయాలి
ఎల్ఇసీ జీవన్ ఆనంద్ పాలసీ చాలా సులభం. రోజుకు 45 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే చాలు. అంటే నెలకు 1358 రూపాయలు మాత్రమే. 35 సంవత్సరాల టైమ్ లిమిట్ ఉంటుంది. అంటే పాలసీ చాలా ఏళ్ల పాటు ఉంటుంది. మెచ్యూరిటీ 35 ఏళ్లు పూర్తయిన తరువాత 25 లక్షలు అందుతాయి.
Also read: Tata Punch Car Insurance: టాటా పంచ్ కారును ఇన్సూరెన్స్ కోసం ఓనర్ ఏం చేస్తున్నాడో చూడండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook