BCCI Selection Committee: చీఫ్‌ సెలక్టర్‌గా మరోసారి చేతన్‌ శర్మ.. బీసీసీఐ కొత్త సెలెక్షన్‌ కమిటీ సభ్యులు వీరే!

BCCI announces new selection committee for senior mens team. భారత మెన్స్‌ క్రికెట్‌ జట్టు సెలెక్షన్ కమిటీ సభ్యుల జాబితాను భారత క్రికెట్‌ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) ప్రకటించింది.   

Written by - P Sampath Kumar | Last Updated : Jan 7, 2023, 06:07 PM IST
  • టీమిండియా చీఫ్‌ సెలక్టర్‌గా చేతన్‌ శర్మ
  • బీసీసీఐ ప్యానెల్‌ సభ్యులు వీరే
  • శివ్‌ సుందర్‌ దాస్‌, సుబ్రతో బెనర్జీకి చోటు
BCCI Selection Committee: చీఫ్‌ సెలక్టర్‌గా మరోసారి చేతన్‌ శర్మ.. బీసీసీఐ కొత్త సెలెక్షన్‌ కమిటీ సభ్యులు వీరే!

Chetan Sharma to continue as BCCI selection committee chairman: భారత మెన్స్‌ క్రికెట్‌ జట్టు సెలెక్షన్ కమిటీ సభ్యుల జాబితాను భారత క్రికెట్‌ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) ప్రకటించింది. సీనియర్‌ మెన్స్‌ జాతీయ జట్టు సెలెక్షన్‌ కమిటీ ఛైర్మన్‌గా చేతన్‌ శర్మ మరోసారి నియమితులయ్యారు. ఈ విషయాన్ని బీసీసీఐ శనివారం (జనవరి 7) అధికారికంగా వెల్లడించింది. చేతన్‌ శర్మతో పాటు శివ్‌ సుందర్‌ దాస్‌, సుబ్రతో బెనర్జీ, సలీల్‌ అంకోలా, శ్రీధరన్‌ శరత్‌ బీసీసీఐ సెలక్షన్‌ కమిటీలో చోటు దక్కించుకున్నారు. 

'టీమిండియా మెన్స్ సీనియర్‌ సెలెక్షన్ కమిటీ నియామకాలను బీసీసీఐ ప్రకటించింది. చేతన్‌ శర్మను బీసీసీఐ సెలెక్షన్ కమిటీకి ఛైర్మన్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది' అని బీసీసీఐ తన అధికారిక ట్విటర్‌లో ఓ పోస్ట్ చేసింది. బీసీసీఐ మాజీ సెలెక్షన్ కమిటీ ఛైర్మన్‌ చేతన్‌ శర్మను మరోసారి సెలెక్షన్ కమిటలోకి నియమిస్తారనే వార్తలు సోషల్‌ మీడియాలో వచ్చినప్పటికీ.. చీఫ్‌ సెలెక్టర్‌గా ఎంపిక చేస్తారని ఎవరూ ఊహించలేదు. కానీ బీసీసీఐ మాత్రం ఛైర్మన్‌కే మరోసారి ఓటేసింది. 

ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచకప్‌ 2022లో భారత్ దారుణ వైఫల్యం నేపథ్యంలో సెలక్షన్‌ కమిటీని బీసీసీఐ రద్దు చేసింది. వెంటనే కొత్త సెలెక్టర్ల కోసం బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది. 18 నవంబర్ 2022న బోర్డు తన అధికారిక వెబ్‌సైట్‌లో ఐదు పోస్టుల కోసం ఓ ప్రకటన జారీ చేసింది. దాదాపు 600 మంది అప్లై చేసుకున్నారు. వ్యక్తిగత ఇంటర్వ్యూల అనంతరం క్రికెట్‌ సలహా కమిటీ (సీఏసీ) 11 మంది వ్యక్తులను షార్ట్‌లిస్ట్ చేసింది. 

ఆపై 11 మందిలో షార్ట్‌లిస్ట్‌ చేసి ఐదుగురిని ఎంపిక చేసినట్లు బీసీసీఐకి సీఏసీ పేర్కొంది. బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ సభ్యుల జాబితాను నేడు బోర్డు ప్రకటించింది. ఈ కమిటీకి చైర్మన్‌గా చేతన్‌ శర్మ ఉంటాడని బీసీసీఐ తెలిపింది. ఛైర్మన్‌ చేతన్‌ శర్మకు ఏడాదికి రూ. 1.25 కోట్లు పారితోషికంగా బీసీసీఐ ఇవ్వనుంది.  శివ్‌ సుందర్‌ దాస్‌, సుబ్రతో బెనర్జీ, సలీల్‌ అంకోలా, శ్రీధరన్‌ శరత్‌లకు రూ. కోటి పారితోషికం అందనుంది. 

Also Read: Kajal Aggarwal Pics: కాజల్ అగర్వాల్ కిరాక్ పోజులు.. అందంతో మైకం తెప్పిస్తున్న చందమామ!  

Also Read: Sadha Hot Pics: స్లీవ్ లెస్ డ్రెస్‌లో హాట్ ట్రీట్.. సదా స్మైల్‌కు అందరూ ఫిదా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

 

Trending News