పెట్టుబడి అనేది సురక్షితంగా ఉండాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఎందుకంటే కష్టపడి సంపాదించేది పెట్టుబడిగా పెట్టినప్పుడు భవిష్యత్‌కు ఓ ఆసరా కావాలి. లేకపోతే మొదటికే మోసమొస్తుంది. ఈ క్రమంలో ఎస్ఐపీ ప్లాన్స్ మంచి ప్రత్యామ్నాయాలు కావచ్చు.
భవిష్యత్ కోసం పెట్టే పెట్టుబడికి ప్లానింగ్ అవసరమౌతుంటుంది. అదే సమయంలో ఆ పెట్టుబడులు సురక్షితంగా ఉండాలి. పెట్టుబడులకు ఓ పరిమితి గానీ, ఓ సమయం గానీ ఉండదు. ఎప్పుడైనా ఎవరైనా ఎంతైనా పెట్టవచ్చు. మీ ఆదాయంలోని ఓ భాగాన్ని కచ్చితంగా పెట్టుబడుల్లో పెడితే భవిష్యత్తులో మంచి లాభాలుంటాయి.
పొదుపు కోసం మనకు చాలా విధానాలున్నాయి. కానీ కొన్నింటిలోనే డబ్బులు పెట్టుబడి పెట్టడం మంచి పద్ధతి. ఇప్పటివరకూ మీరు ఎక్కడా పెట్టుబడులు పెట్టకపోతే..ఇక ఆలస్యం చేయవద్దు. తక్కువ బడ్జెట్లోనే మంచి ఫండింగ్ ఎలా సిద్ధం చేసుకోవచ్చు అంటున్నారు మార్కెట్ నిపుణులు. అవే ఎస్ఐపీ. సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్. ప్రతి నెల తక్కువ మొత్తంలో పొదుపు చేస్తూ..భారీగా నిధులు కూడగట్టాలంటే ఎస్ఐపీ మీకు అద్భుతమైన విధానం. అందుకే మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడులు పెట్టడం వల్ల మీకు దీర్ఘకాలిక లాభం కలుగుతుంది.
నెలకు వేయి రూపాయలతో కోటీశ్వరుడు
చిన్న చిన్నపెట్టుబడులతోనే దీర్ఘకాలంలో భారీగా నిధులు జమ చేసేందుకు వీలుంటుంది. దీనికోసం మీరు ప్రారంభంలో నెలకు వేయి రూపాయల్నించి ప్రారంభిస్తే సరిపోతుంది. అంటే మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడితే ప్రయోజనకరం. దీనికోసం ప్రతినెలా వేయి రూపాయలు పెట్టుబడిని మ్యూచువల్ ఫండ్‌లో పెట్టాల్సి ఉంటుంది. గత కొన్నేళ్లుగా మ్యూచువల్ ఫండ్‌లో 20 శాతం కంటే ఎక్కువే రిటర్న్ వస్తోంది. అంటే మీరు ఈ డబ్బుల్ని 20 ఏళ్లు పెట్టుబడిగా పెడితే..మొత్తం 2.4 లక్షలు జమ అవుతాయి. 20 ఏళ్లలో ఏడాదికి 15 శాతం రిటర్న్ లెక్కేసుకుంటే 15 లక్షల 16 వేల రూపాయలు లభిస్తాయి. అదే ఒకవేళ రిటర్న్ 20 శాతం లభిస్తే మొత్తం 31.61 లక్షలు వస్తుంది.
ఒకవేళ మీరు ప్రతినెలా వేయి రూపాయల చొప్పున 25 ఏళ్ల వరకూ పెట్టుబడి పెడితే..దీనిపై మీకు 20 శాతం ఏడాదికి రిటర్న్ లభిస్తుంది. అంటే మెచ్యూరిటీ పూర్తయిన తరువాత 86.27 లక్షలు లభిస్తాయి. అదే విధంగా 30 ఏళ్లు పూర్తయితే..20 శాతం రిటర్న్ చొప్పున మీకు 2 కోట్ల 33 లక్షల 60 వేల రూపాయలు లభిస్తాయి.
మీ సేవింగ్ కెపాసిటీని బట్టి నెలకు ఎంతైనా పెట్టుబడి పెట్టవచ్చు. సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఎప్పుడూ దీర్ఘకాలంలోనే లాభాల్ని ఆర్జిస్తాయి. అదే సమయంలో ఎప్పటికప్పుుడు మార్కెట్ కూడా పరిశీలిస్తుండాలి.
Also read: Whatsapp New Feature: వాట్సప్ కొత్త ఫీచర్, ఇక నుంటి డిలీటెడ్ మెస్సేజ్‌లు తిరిగి పొందే అవకాశం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook