మీరు విన్నది కరెక్టే! కొద్దిరోజులుగా తగ్గుతూ వస్తున్న పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరగనున్నాయి. త్వరలో అట్లాంటిక్ మహా సముద్రంలో హరికేన్లు ప్రారంభంకానున్న నేపథ్యంలో దేశీయంగా ఇంధన ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని సమాచారం. గతేడాది భారీ ఎత్తున హర్వే హరికేన్, ఇర్మా హరికేన్ ఏర్పడటంతో అంతర్జాతీయంగా రిఫైనరీ అవుట్ పుట్ 13 శాతం మేర పడిపోయింది. దీంతో ఇంధన ధరలు భారీగా పెరిగాయి. ఈ ఏడాది కూడా క్రితంసారిలాగే అట్లాంటిక్ బేసిన్లో ఏర్పడే హరికేన్లు ఇంధన ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
అట్లాంటిక్ బేసిన్లో జూన్ నుంచి నవంబర్ వరకు హారికేన్ సీజన్ ప్రారంభమవుతోంది. ఏ సమయంలోనైనా హరికేన్లు విరుచుకుపడే అవకాశం ఉంది. పీక్ స్టేజ్లో ఉండే ఆగస్టు- అక్టోబర్ మధ్య కాలంలో రాకాసి హారికేన్లు ఏర్పడితే, దేశీయంగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.