తూర్పు గోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు శ్మశానంలో నిద్రించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఏకంగా రెండు రోజుల పాటు ఆయన శ్మశానంలో నిద్రించారు. పాలకొల్లు పట్టణంలోని హిందూ శ్మశానవాటికలో అభివృద్ధి పనులు వేగంగా జరగకపోవడం, దయ్యాలున్నాయని కార్మికులు భయపడటం.. తమకేమన్నా అవుతుందేమోనని భయంతో పనులకు వచ్చేందుకు వెనకడుగువేస్తున్నారు.
ఈ విషయం.. ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు దృష్టికి వెళ్లింది. శ్మశానవాటిక అభివృద్ధి పనులు నెమ్మదించడంతో కార్మికులు, స్థానికుల్లో ధైర్యం నింపేందుకు ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. దెయ్యాలు లేవని తెలియజేయడం కోసం ఆయన రెండు రోజులపాటు శ్మశానంలో నిద్రించాలనుకున్నారు. అంతే.. అనుకున్నదే తడవుగా శుక్రవారం, శనివారం రాత్రి నిద్రచేశారు. శ్మశాన వాటికలోనే అల్పాహారం తీసుకున్నారు. అక్కడే కాలకృత్యాలు తీర్చుకున్నారు. అనంతరం అక్కడే మడత మంచం వేసుకొని నిద్రించారు.
ఎమ్మెల్యే చర్యతో స్థానికులు, ఊరివారందరూ నివ్వెరపోయారు. స్థానికులు ఎమ్మెల్యే ధైర్యాన్ని మెచ్చుకున్నారు. ఇక కార్మికులు కూడా యుద్ధప్రాతిపదికన పనులు చేయడానికి ముందుకువచ్చారు.
TDP MLA Nimmala Rama Naidu deserves praise for spending a night at a crematorium where workers had refused to enter after dark to do modernisation work out of fear of ‘spirits’ pic.twitter.com/NLvP2yzNnw
— Pinarayi Vijayan (@vijayanpinarayi) June 24, 2018
టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, స్మశానంలో నిద్ర...
స్మశానవాటిక నిర్మాణ పనులు జరుగకపోవడానికి కార్మికుల్లో నెలకొన్న భయాందోళనలే కారణం అని తెలుసుకుని, అందరిలో భయాన్ని పొగొట్టేందుకు ఒక రాత్రి స్మశానంలో గడిపిన MLA pic.twitter.com/DpthAE9h4H
— Achanta Raja (@achantaraja) June 23, 2018