RGV Interview with Siri Stazie రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు తీసే సినిమాల కన్నా.. ఆయన చేసే ఇంటర్వ్యూలే ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. ఆర్జీవీ హీరోయిన్ల కంటే.. ఆర్జీవీతో ఇంటరాక్ట్ అయ్యే యాంకర్లు, యాక్టర్లే ఎక్కువగా హైలెట్ అవుతుంటాయి. ఆ మధ్య అరియానా, అషూ రెడ్డిలు ఇలానే రచ్చ చేశారు. మరీ ఈ మధ్య అయితే అషూ రెడ్డి కాలిని, పాదాలను నాకుతూ ఆర్జీవీ నీచానికి దిగజారిపోయాడు.
ఇప్పుడు డేంజరస్ అంటూ ఓ ఇరవై మంది అమ్మాయిలతో ఆర్జీవీ చేసిన స్పెషల్ ఇంటరాక్షన్, అందులో ఓ అమ్మాయిని సపరేట్గా ఎంచుకుని మరింత డెప్త్‌గా ఇంటర్వ్యూ చేయడంతో ఆర్జీవీ హాట్ టాపిక్ అయ్యాడు. ఆర్జీవీని హగ్ అడిగి తీసుకున్న అమ్మాయి.. పది రోజుల వరకు స్నానం చేయను అంటూ కామెంట్ చేసింది. దీంతో ఆ అమ్మాయిని పట్టుకొచ్చి కెమెరాలు ఎక్కడెక్కడో పెట్టించి ఓ ఇంటర్వ్యూ చేశాడు వర్మ.
ఇదే ఇంటర్వ్యూ వంద ఏళ్ళ క్రితం వస్తే రాళ్లతో కొట్టి చంపేసేవారు. ఏభై ఏళ్ల క్రితం వెలి వేసేవారు. ఇప్పుడు దాదాపుగా సమాజం బరి తెగించడం వల్ల మీరు బతికిపోయారు @RGVzoomin https://t.co/9ylSDJY5qd
— BVS Ravi (@BvsRavi) December 14, 2022
ఇందులో ఆ అమ్మాయిని వర్మ అడిగిన ప్రశ్నలు, ముచ్చట్లు పెట్టుకున్న తీరు, కాలి సందుల్లోంచి, తొడల మధ్యలోంచి కెమెరాలు పెట్టించిన తీరుకు జనాలు తలల పట్టేసుకుంటున్నారు. ఇదేక్కడి రోగంరా బాబు అంటూ ఆర్జీవీని తిట్టేసుకుంటున్నారు. ఈ ఇంటర్వ్యూ మీద బీవీఎస్ రవి స్పందించాడు.
ఇదే ఇంటర్వ్యూ వంద ఏళ్ళ క్రితం వస్తే రాళ్లతో కొట్టి చంపేసేవారు. ఏభై ఏళ్ల క్రితం వెలి వేసేవారు. ఇప్పుడు దాదాపుగా సమాజం బరి తెగించడం వల్ల మీరు బతికిపోయారు అంటూ ఆర్జీవీకి దండం పెట్టేశాడు వర్మ. ఇక ఆర్జీవీ ఈ ఇంటర్వ్యూ చేసిన సదరు అమ్మాయిని ఫేమస్ చేశాడు. ఇక నెక్ట్స్ బిగ్ బాస్ సీజన్‌కు మరొక అమ్మాయి దొరికేసినట్టు కనిపిస్తోంది.
Also Read : Pawan Kalyan Martial Arts : పవన్ కళ్యాణ్ మీద ట్రోలింగ్.. మంచో చెడో కానీ సంతోషంగా ఉందన్న మంచు లక్ష్మీ
Also Read : Vijay Devarakonda Kushi : సమంత వల్ల మరింత ఆలస్యం.. విజయ్ 'ఖుషీ' ఇప్పట్లో లేనట్టే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook