Spinach Juice For Weight Loss and Diabetes: వింటర్ సీజన్లో మార్కెట్లో విచ్చలవిడిగా ఆకుకూరలు కూరగాయలు తాజాగా లభిస్తాయి. ముఖ్యంగా తోటకూర బచ్చల కూర లాంటి అధిక పోషకాలు కలిగిన ఆకుకూరలు అధికంగా లభిస్తూ ఉంటాయి. అయితే వీటిని జలుబుతో బాధపడుతున్న వారు ముఖ్యంగా సీజనల్ వ్యాధులతో బాధపడుతున్న వారు ఆహారంలో తీసుకుంటే లేదా రసంల తయారు చేసి తాగితే సులభంగా వాటి నుంచి విముక్తి కలుగుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. బచ్చలి కూర రసాన్ని ప్రతిరోజు తాగితే అందులో ఉండే విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కె, మెగ్నీషియం, మాంగనీస్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు, శరీరానికి పుష్కలంగా లభిస్తాయి. అంతేకాకుండా కంటి చూపు కూడా మెరుగుపడి రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
బచ్చలి కూరను క్రమం తప్పకుండా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:
>>బచ్చలి కూర రసా న్ని రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి ప్రతి రోజు తాగాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ రసంలో శరీర శక్తిని పెంచే క్యాల్షియం, సోడియం, క్లోరిన్, ఫాస్ఫరస్, ప్రోటీన్, ఐరన్ లు పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి క్రమం తప్పకుండా ఈ రసాన్ని తాగడం వల్ల ఆ జీర్ణం పొట్ట సమస్యలు కూడా సులభంగా తగ్గుతాయి.
>>ముఖ్యంగా ఈ రసంలో ఐరన్ పరిమాణం అధికంగా ఉంటుంది కాబట్టి రక్తహీనతతో బాధపడుతున్న వారికి ప్రభావవంతంగా పనిచేస్తుంది అంతేకాకుండా శరీరంలో రక్తాన్ని పెంచేందుకు కీలకంగా సహాయపడుతుంది. ఆధునిక జీవనశైలి కారణంగా జ్ఞాపకశక్తి కోల్పోతున్న వారికి ఈ రసం ఔషధం లో పనిచేస్తుంది. అంతేకాకుండా రక్తపోటు సమస్యలతో బాధపడుతున్న వారు కూడా ఈ రసం చాలా సహాయపడుతుంది. ఇందులో కాల్షియం కూడా అధిక పరిమాణంలో ఉంటుంది కాబట్టి ఎముకలను కూడా దృఢంగా చేసేందుకు దోహదపడుతుంది.
>>పాలకూర రసం జీర్ణక్రియను పెంచేందుకు.. శరీరంలోని పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను కరిగించేందుకు ప్రభావంతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు వేగంగా బరువును తగ్గించి చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అయితే రెట్టింపు ప్రయోజనాలు పొందేందుకు ఈ రసంలో నల్ల జీలకర్ర పొడిని కలిపి తీసుకుంటే మంచి ప్రయోజనాలు పొందుతారు.
Also Read : Watch Now: కాటేసే నాగరాజుకే కిస్ ఇచ్చిన బలరాజు..నెట్టింట తెగ చెక్కర్లు కొడుతున్న వైరల్ వీడియో..
Also Read : Rhino In Football Ground: ఫుట్‌బాల్ గ్రౌండ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఖడ్గమృగం.. ఆటగాళ్లు ఏం చేశారో చూడండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook