Kulwinderjit Singh Arrest: ఎయిర్‌పోర్టులో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్

Kulwinderjit Singh Alias Khanpuria Arrest: బ్యాంకాక్ లో తలదాచుకున్న కుల్విందర్జీత్ సింగ్ అలియాస్ ఖాన్‌పురియా భారత్ కి తిరిగి వస్తున్నట్టుగా విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుకున్న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు అతన్ని ఢిల్లీ ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. 

Written by - Pavan | Last Updated : Nov 21, 2022, 11:30 PM IST
  • ఢిల్లీ ఎయిర్ పోర్టులో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్
  • ఎన్ఐఏ అదుపులో కుల్విందర్జీత్ సింగ్ అలియాస్ ఖాన్‌పురియా
  • 1990 ల నాటి నుంచి దేశవ్యాప్తంగా అనేక ఉగ్ర దాడుల్లో ఖాన్‌పురియా హస్తం
Kulwinderjit Singh Arrest: ఎయిర్‌పోర్టులో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్

Kulwinderjit Singh Alias Khanpuria Arrest: నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఢిల్లీ ఎయిర్ పోర్టులో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ కుల్విందర్జీత్ సింగ్ అలియాస్ ఖాన్‌పురియాను అరెస్ట్ చేసింది. బబ్బర్ ఖాస్లా ఇంటర్నేషనల్ (BKI), ఖలిస్తానీ లిబరేషన్ ఫోర్సెస్ (KLF) వంటి ఉగ్రవాద సంస్థలతో ఖాన్‌పురియాకు సంబంధాలు ఉన్నాయి. 2019 నుంచి పోలీసుల కన్నుగప్పి తప్పించుకు తిరుగుతున్న ఖాన్‌పురియాను పట్టుకునేందుకు ప్రభుత్వం అతడి తలపై రూ. 5 లక్షల నగదు బహుమతి ప్రకటించింది. 

గత కొద్ది రోజులుగా బ్యాంకాక్ లో తలదాచుకున్న కుల్విందర్జీత్ సింగ్ అలియాస్ ఖాన్‌పురియా భారత్ కి తిరిగి వస్తున్నట్టుగా విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుకున్న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు నవంబర్ 18న అతడు భారత్‌లోకి అడుగుపెట్టడంతోనే ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో మాటు వేసి పట్టుకున్నారు. శుక్రవారమే ఖాన్‌పురియాను అదుపులోకి తీసుకున్నప్పటికీ సోమవారం ఎన్ఐఏ అధికారులు ఈ విషయాన్ని వెల్లడించినట్టుగా తెలుస్తోంది.

దేశవ్యాప్తంగా గత కొన్ని దశాబ్ధాలుగా జరిగిన అనేక ఉగ్రవాద దాడుల్లో ఖాన్‌పురియా హస్తం ఉన్నట్టు పోలీసుల వద్ద సమాచారం ఉంది. పంజాబ్ లో ఉగ్రదాడులకు కుట్ర పన్నడంతో పాటు, ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ లో బాంబు బ్లాస్ట్ కేసు, 1990 లలో వివిధ ప్రదేశాల్లో గ్రనేడ్ దాడులకు పాల్పడిన ఘటనల్లో కుల్విందర్జీత్ సింగ్ అలియాస్ ఖాన్‌పురియా పాల్పంచుకున్నట్టు పోలీసు క్రైమ్ రికార్డులు చెబుతున్నాయి.  ఖాన్‌పురియాను ఎన్ఐఏ ( NIA Investigation ) విచారిస్తే దేశంలో ఉగ్రదాడులు.. మరీ ముఖ్యంగా ఖలిస్థాని ఉద్యమం పేరు వాడుకుని అరాచకాలకు పాల్పడాలని కుట్రలు పన్నుతున్న పాకిస్థాన్ అరాచక శక్తులకు సంబంధించిన సమాచారం తెలిసే అవకాశం ఉంది.

Also Read : Ration Card: రేషన్ కార్డుదారులకు అలర్ట్.. ఆ కార్డులు మొత్తం రద్దు 

Also Read : Aftab Poonawala CCTV Footage: శ్రద్ధా శరీర భాగాలున్న బ్యాగుతో అఫ్తాబ్.. పోలీసుల చేతికి సీసీటీవీ దృశ్యాలు ?

Also Read : PM Kisan: పీఎం కిసాన్ యోజన పథకం లబ్ధిదారులకు ముఖ్య గమనిక.. ఆ రోజే లాస్ట్..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News