Super Star Krishna Cardiac Arrest : సూపర్ స్టార్ కృష్ణ కార్డియక్ అరెస్ట్‌తో ఆస్పత్రికి వచ్చారని వైద్యలు తెలిపారు. నిన్న అర్దరాత్రి దాటాక కృష్ణ తీవ్ర అస్వస్థతకు లోనవ్వడంతో కుటుంబ సభ్యులు కాంటినెంటల్ హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. కృష్ణ ఆరోగ్యం నిలకడగానే ఉందని, 24 గంటల్లో డిశ్చార్జ్ చేస్తారని, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నరేష్ చెప్పుకొచ్చాడు.
కానీ ఇప్పుడు కృష్ణ పరిస్థితి మీద కాంటినెంటెల్ వైద్యులు ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన కార్డియక్ అరెస్ట్‌తో ఆస్పత్రికి వచ్చారని, ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని, తొమ్మిదేళ్లుగా ఆయన మా ఆస్పత్రికి వస్తూనే ఉన్నారని అన్నారు. ప్రస్తుతం కార్డియక్ అరెస్టుతో బయటపడ్డారని, కానీ ఆయనకు వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు.
24 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమని వైద్యులు అంటున్నారు. క్రిటికల్ కండీషన్‌లో వైద్యులంతా కలిసి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఇప్పటి నుంచి ప్రతీ గంట కీలకమే అని వైద్యులు అంటున్నారు. ఆయన శరీరం సహకరిస్తుందా? లేదా? అన్నది తెలియడం లేదని వైద్యులు పేర్కొన్నారు.
అర్దరాత్రి గుండెపోటుతో స్పృహలేని స్థితిలో ఆయన్ను హాస్పిటల్‌కు తీసుకొచ్చారని, ఆయన ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని అందరం ప్రార్ధిద్దామని వైద్యులు తెలిపారు. 24 గంటలు గడిచాకే హెల్త్ బులిటెన్ విడుదల చేస్తామని, ఆల్రెడీ ఇరవై నిమిషాల పాటు సీపీఆర్ నిర్వహించామని, ఇప్పుడు ఆరోగ్యం కాస్త నిలకడగానే ఉన్నా కూడా క్రిటికల్ కండీషన్‌లోనే ఆయన ఉన్నారని చెప్పుకొచ్చారు.
Also Read : Super Star Krishna Health update : హాస్పిటల్లో సూపర్ స్టార్ కృష్ణ.. ఆందోళనలో అభిమానులు
Also Read : Bigg Boss Vasanthi Buzz Interview : నీట్‌గా రెడీ అవ్వడం తప్పా ఆడిందేమీ లేదు.. వసంతి పరువుతీసిన యాంకర్ శివ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook
Super Star Krishna Cardiac Arrest : సూపర్ స్టార్ కృష్ణకు గుండెపోటు.. క్రిటికల్ స్టేజ్.. వైద్యులు ఏమన్నారంటే
ఆస్పత్రిలో సూపర్ స్టార్ కృష్ణ
కార్డియాక్ అరెస్ట్‌తో కృష్ణ
ఐసీయూలో కృష్ణకు చికిత్స