Super Star Krishna Health update సూపర్ స్టార్ కృష్ణ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్ కాంటినెంటల్ ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఇటీవలె ఆయన భార్య ఇందిరాదేవి మరణంతో ఘట్టమనేని కుటుంబం విషాదంలో ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన అనారోగ్యానికి గురైన విషయం తెలుసుకుని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
సోమవారం తెల్లవారుఝామున తన నివాసంలో అస్వస్థతకు గురి కావడంతో కుటుంబసభ్యులు కృష్ణను ఆసుపత్రికి తరలించారు. అయితే ఘట్టమనేని ఇంట్లో వరుసగా విషాదలు నెలకొంటున్న సంగతి తెలిసిందే. కరోనా సమయంలో కృష్ణ పెద్ద కొడుకు, మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు కన్నుమూశారు. అంతకు ముందు విజయ నిర్మల మరణించారు. రీసెంట్‌గా కృష్ణ మొదటి భార్య ఇందిరమ్మ కన్నుమూశారు. ఇలా ఘట్టమనేని ఇంట్లో వరుసగా విషాదాలు జరుగుతుండటంతో ఘట్టమనేని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
ఇప్పుడు ఇలా కృష్ణకు తీవ్ర అస్వస్థత అని, ఆస్పత్రిలో జాయిన్ చేశారనే వార్తలు ఒక్కసారి వైరల్ అవ్వడం ప్రారంభించాయి. దీంతో ఘట్టమనేని అభిమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. 24 గంటల్లో ఆయన్ను డిశ్చార్జ్ చేస్తారని సమాచారం అందుతోంది. కృష్ణ గత కొంత కాలం నుంచి శ్వాస కోశ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే.
Also Read : Karthi Facebook Hacked : హీరో కార్తీకి చుక్కెదురు.. ఫేస్ బుక్ హ్యాక్ అవ్వడంతో ట్వీట్
Also Read : Aadya Video: మొన్న పవన్ కళ్యాణ్.. ఇప్పుడు ఆయన కూతురు.. తిట్టిపోస్తున్న నెటిజన్లు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook
Super Star Krishna Health update : హాస్పిటల్లో సూపర్ స్టార్ కృష్ణ.. ఆందోళనలో అభిమానులు
ఆస్పత్రిలో సూపర్ స్టార్ కృష్ణ
తీవ్ర అస్వస్థతకు గురైన సీనియర్ హీరో
ఘట్టమనేని అభిమానుల్లో ఆందోళన