Unstoppable with NBK 2 Latest Episode Update: నందమూరి బాలకృష్ణకి ప్రస్తుతం గోల్డెన్ టైం నడుస్తుంది. గత ఏడాది ఆయన చేసిన అఖండ సినిమా సూపర్ హిట్ గాక అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే అనే ఆహా టాక్స్ షో కూడా సూపర్ హిట్ అయింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే సెకండ్ సీజన్ ప్లాన్ చేశారు. ఇప్పటికీ నాలుగు ఎపిసోడ్లు రిలీజ్ అయ్యాయి. అందులో మొదటి ఎపిసోడ్ లో తన బావ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్ తో ప్లాన్ చేయగా ఆ ఎపిసోడ్ సూపర్ హిట్ అయింది.
ఈ క్రమంలో రెండవ ఎపిసోడ్ కూడా గట్టిగానే ప్లాన్ చేశారు. హీరోలు విశ్వక్సేన్, సిద్దు జొన్నలగడ్డ ఇద్దరితో సెకండ్ ఎపిసోడ్ చేసి రిలీజ్ చేయగా దానికి కూడా మంచి రెస్పాన్స్ లభించింది. అయితే మూడో ఎపిసోడ్ షూటింగ్ విషయంలో కాస్త ఇబ్బందులు ఏర్పడడంతో మొదటి ఎపిసోడ్ ని అన్ సెన్సార్ వెర్షన్ అని చెప్పి మరో అరగంట పాటు మరిన్ని ప్రశ్నలు యాడ్ చేసి రిలీజ్ చేశారు. ఇక నాలుగో ఎపిసోడ్లో హీరోలు అడవి శేష్, శర్వానంద్ ఇద్దరినీ కలిపి ఒక ఎపిసోడ్ చేయగా దానికి కూడా మంచి రెస్పాన్స్ లభించింది.
అయితే ఈ సెకండ్ సీజన్లో ఊహించని విధంగా రాజకీయ నాయకులను కూడా షోకి తీసుకొస్తున్న నేపథ్యంలో నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మరో ఇద్దరు రాజకీయ నాయకులని రంగంలోకి దింపుతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. వారు ఎవరో కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అలాగే మాజీ స్పీకర్ కేఆర్ సురేష్ రెడ్డి అని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యాంధ్ర పార్టీ అని ఒక పార్టీ పెట్టి ఎన్నికల్లో దిగగా తీవ్ర పరాజయం పాలయ్యారు.
ఆ తర్వాత కొన్నాళ్లకు మళ్ళీ కాంగ్రెస్ గూటికి చేరారు. సురేష్ రెడ్డి తర్వాత టీఆర్ఎస్ లో చేరి రాజ్యసభ మెంబర్ అయ్యారు. ఈ ఎపిసోడ్ షూటింగ్ సోమవారం ప్రారంభం కానుందని అంటున్నారు. ఈ ఇద్దరూ చదువుకునే రోజుల్లో బాలయ్య క్లాస్ మేట్స్ అని గతంలో కొన్ని సంధర్భాల్లో ఆయనే బయట పెట్టారు. ఈ క్రమంలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, కే ఆర్ సురేష్ రెడ్డి అతిథులుగా రాబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
Also Read: Naga Chaitanya - Samantha : కలవబోతోన్న సమంత నాగ చైతన్య.. ఇంట్రెస్టింగ్ న్యూస్ లీక్
Also Read: Changes in SSMB 28: పంతం పట్టిన మహేష్.. దెబ్బకు కథ మొత్తం మార్చేసిన గురూజీ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook