Solar Eclipse 2022: సూర్యగ్రహణం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాలు మూసివేత..

Solar Eclipse: ఇవాళ సూర్యగ్రహణం కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దేవాలయాలను మూసివేయనున్నారు. ఆలయ సంప్రోక్షణ, ఆలయ శుద్ధి కార్యక్రమాలు తర్వాత తిరిగి తెరవనున్నారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 25, 2022, 11:44 AM IST
Solar Eclipse 2022: సూర్యగ్రహణం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాలు మూసివేత..

Solar Eclipse Temples closed: ఇవాళ సాయంత్రం ఏర్పడబోయే పాక్షిక సూర్యగ్రహణం సందర్భంగా దేశంలోని ప్రధాన ఆలయాలన్నీ మూసివేయనున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని దేవాలయాలను ఉదయం 9 నుంచి సాయంత్రం 7 గంటల వరకు మూసివేయనున్నట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. అనంతరం ఆలయ సంప్రోక్షణ, ఆలయ శుద్ధికార్యక్రమాలను నిర్వహించి.. భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు. 

ఏపీలో..
పాక్షిక సూర్యగ్రహణ (Partial Solar Eclipse 2022) నేపథ్యంలో.. ఏపీలోని తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఉదయం 8 నుంచి రాత్రి 7.30 గంటల వరకు ఆలయం మూసివేయనున్నారు. విజయవాడ కనకదుర్గ గుడిలో ఉదయం 11 గంటల తర్వాత ఆలయ ద్వారాలను క్లోజ్ చేయనున్నారు. శ్రీశైల మల్లన్న, ద్వారకా తిరుమల, భద్రాచలం ఆలయాలను కూడా మూసివేయనున్నారు. సంప్రోక్షణ, శుద్ధి చేసిన తర్వాత ఆలయాలను తిరిగి తెరవనున్నారు. 

తెలంగాణలో...
ఇప్పటికే యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల దర్శనాలు నిలిపివేశారు.  ఉదయం 8 గంటల 50 నిమిషాల నుంచి రేపు ఉదయం 8 గంటల వరకు మూసివేయనున్నట్లు ఆలయ పండితులు తెలిపారు. రేపు ఆలయాన్ని శుద్ధి చేసి అనంతరం 10: 30 గంటల నుంచి భక్తులను అనుమతించనున్నారు. భద్రాద్రి, కాళేశ్వరం, బాసర, వేములవాడ, జోగులాంబ ఆలయాలను కూడా మార్నింగ్ 9 గంటలలోపు మూసివేశారు. సంప్రోక్షణ నిర్వహించి తర్వాత ఆలయాల్లోకి భక్తులను అనుమతించనున్నారు. 

Also Read: surya grahan 2022 time: ఇవాళే సూర్యగ్రహణం, ఏ రాశిపై ఎలాంటి ప్రభావం, హైదరాబాద్ లో గ్రహణ సమయం ఎంత? 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News