Diabetes Control With Tamarind Juice: చింతపండు పేరు చెప్పగానే చాలామందికి నోట్లో నీళ్లు ఊరుతాయి. కొంచెం పుల్లగా కొంచెం తీయగా.. రుచి చూడడానికి ఇంపుగా ఉంటుంది. అయితే ఇందులో ఉన్న పోషకాలు శరీరానికి చాలా రకాలుగా ప్రయోజనాలను చేకూర్చుతాయి. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా వినియోగించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చింతపండులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. అంతేకాకుండా ఇందులో విటమిన్ ఏ విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా వినియోగించడం వల్ల శరీరంలో ఫ్రీ రాడికల్ సమస్యలను తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా చర్మ సౌందర్యాన్ని కూడా పెంచుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్యలే కాకుండా దీర్ఘకాలిక సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చు. అయితే ఆ దీర్ఘకాలిక సమస్యలకు ఎలా చెక్ పెట్టాలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం..
బరువును తగ్గించడానికి సహాయపదుతుంది:
చింతపండులో హైడ్రోసిట్రిక్ యాసిడ్లు అధిక పరిమాణంలో ఉండడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వుని సులభంగా తగ్గించడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు భావిస్తున్నారు. ఈ కారణం చేత ఆకలి తగ్గి క్రమంగా శరీర బరువు కూడా తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు క్రమం తప్పకుండా చింతపండును వినియోగించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
మధుమేహాన్ని కూడా తగ్గిస్తుంది:
ఆధునిక జీవనశైలి కారణంగా చాలామంది మధుమేహం సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి క్రమం తప్పకుండా ఒక చిన్న గ్లాసెడు చింతపండు రసం తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా క్రమం తప్పకుండా తాగడం వల్ల రక్తంలోని చక్కర పరిమాణాలను సులభంగా తగ్గించి మధుమేహాన్ని క్రమంగా నియంత్రిస్తుంది.
గుండె వ్యాధులకు చెక్ పెడుతుంది:
గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే వారికి చింతపండు ఓ ఔషధంలా పనిచేస్తుంది. ఇందులో గుండెకు కావాల్సిన ఫ్లేవానాయిడ్స్ పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి దీనిని క్రమం తప్పకుండా ఆహారంలో వినియోగించడం వల్ల గుండె సంబంధిత సమస్యలకు చెక్ పెట్టొచ్చు. ముఖ్యంగా గుండెపోటు సమస్యలతో బాధపడేవారు క్రమం తప్పకుండా చింతపండును ఆహారంలో వినియోగిస్తే మంచి ఫలితాలు పొందుతారు.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి