Budhaditya Yog In Virgo 2022: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఒక గ్రహం తన స్థానాన్ని మార్చుకున్నప్పుడల్లా.. అది అన్ని రాశిచక్ర గుర్తులను ప్రభావితం చేస్తుంది. ఈరోజు సెప్టెంబర్ 17న సూర్యుడు కన్యారాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఇప్పటికే బుధుడు కన్యారాశిలో తిరోగమనంలో ఉన్నాడు. కన్యారాశిలో ఈ సూర్య, బుధల కలయిక వల్ల బుధాదిత్య యోగం (Budhaditya Yog In Virgo 2022) ఏర్పడుతుంది. ఈ యోగం మూడు రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది. వీరు కెరీర్ లో పురోగతి, అపారమైన సంపదను పొందుతారు.
వృషభం (Taurus) - బుధాదిత్య యోగం వల్ల ఈ రాశి వారు ప్రత్యేక ప్రయోజనం పొందనున్నారు. వీరికి పనిచేసే చోట ప్రమోషన్ లభిస్తుంది. భారీగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మీరు ఉద్యోగం మారాలనుకుంటే ఇదే మంచి సమయం. సమాజంలో గౌరవం లభిస్తుంది. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఏదైనా కొత్త పని ప్రారంభించాలన్నా, పెట్టుబడి పెట్టాలన్నా ఇదే మంచి సమయం. వ్యాపారం విస్తరిస్తుంది.
కన్య (Virgo) - ఈ రాశి వారికి ఈ సమయం ప్రత్యేకం. వీరు ఆఫీసులో మంచి పనితీరు కనబరుస్తారు. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ఉద్యోగ రీత్యా విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. కష్టానికి తగిన ఫలాలను అందుకుంటారు. ఇరుక్కుపోయిన డబ్బు తిరిగి మీ వద్దకు చేరుతుంది. కొత్త పని మెుదలుపెట్టడానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీ పార్టనర్ సపోర్టుతో మీరు ఏ పనిలోనైనా విజయం సాధిస్తారు.
మీనం (Pisces)- ఈ సమయంలో ఈ రాశివారి ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. మీరు వ్యాపారంలో పురోగతిని పొందుతారు. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. మీరు ఆఫీసులో ప్రశంసలు అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారికి ఈ సమయం కలిసి వస్తుంది. మీకు ప్రతి రంగంలోనూ గౌరవం దక్కుతుంది.
Also Read; Vishwakarma Puja 2022: రేపే దేవశిల్పి విశ్వకర్మ జయంతి.. ప్రాముఖ్యత, పూజ విధానం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook