Budh Varki In Kanya 2022: బుధ గ్రహం మేధస్సు, తర్కం, వాక్కు, కమ్యూనికేషన్, డబ్బు, వ్యాపారానికి కారకుడు. అలాంటి బుధ గ్రహం సెప్టెంబరు 10న కన్యారాశిలో తిరోగమనం (Mercury Retrograde In Virgo 2022) చేసింది. సాధారణంగా గ్రహాల తిరోగమనం అశుభంగా భావిస్తారు. మెర్య్కూరీ తిరోగమనం మెుత్తం 12 రాశులపై ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
మేషం (Aries) : సహోద్యోగులతో జాగ్రత్తగా ఉండండి, వారు మీ ప్రతిష్టను దెబ్బతీసే అవకాశం ఉంది. ఈ సమయంలో వ్యాపారులు తమ బిజినెస్ ను విస్తరించే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఏర్పడవచ్చు. మీరు కెరీర్‌ని మార్చుకోవచ్చు.
వృషభం (Taurus): ఈ రాశివారు వివిధ మార్గాల్లో డబ్బు సంపాదిస్తారు. మీరు అప్పుల నుండి ఉపశమనం పొందుతారు. షేర్లలో పెట్టుబడి పెట్టడం ద్వారా మంచి లాభాలను గడిస్తారు. తగాదాలకు దూరంగా ఉండండి.
మిథునం (Gemini): మీరు విలాస వంతమైన జీవితాన్ని గడుపుతారు. కెరీర్ లో కొన్ని ఇబ్బందులు తలెత్తినా మళ్లీ సర్దుకుంటాయి. ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకునే ముందు కుటుంబ సభ్యులతో చర్చించండి.
కర్కాటకం (Cancer): వ్యాపారస్తులు ఏదైనా డీల్ చేసే ముందు పేపర్లను చెక్ చేసుకోవాలి. అహంకారాన్ని తగ్గించుకోండి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోండి.
సింహం (Leo): అధిక రుణాలు తీసుకోవద్దు. బడ్జెట్ తయారు చేసి ఖర్చు పెట్టండి. దాతృత్వం చేయండి, కానీ అనవసరమైన కొనుగోళ్లు చేయవద్దు. కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు రావచ్చు.
కన్య (Virgo): మీరు కెరీర్ లో విజయాలు సాధిస్తారు. జీవిత భాగస్వామితో వాదించకండి. ఇతరులు చెప్పే ప్రతిదాన్ని నమ్మవద్దు, అది మీకే నష్టం.
తుల (Libra): ఆలోచించకుండా ఏమీ మాట్లాడకండి, లేకుంటే ఇబ్బందుల్లో పడతారు. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. మీ ప్రత్యర్థులపై నిఘా ఉంచండి. వ్యక్తిగత జీవితంపై శ్రద్ధ తీసుకోండి.
వృశ్చికం (Scorpio): ఈ రాశివారికి అనేక విధాలుగా ఆదాయం వస్తుంది. చిక్కుకున్న డబ్బు మీ వద్దకు చేరుతుంది. స్నేహితులు లేదా తోబుట్టువులతో గొడవలు పడే అవకాశం ఉంది.
ధనుస్సు (Sagittarius): ఈ సమయంలో కుటుంబపరంగా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. మీరు అనుకున్నది సాధిస్తారు. అహంకారాన్ని వీడకపోతే మీ ఇమేజ్ దెబ్బతినే అవకాశం ఉంది.
మకరం (Capricorn): ఉద్యోగ రీత్యా ప్రయాణాలు చేయవచ్చు. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులకు ఇది మంచి సమయం. ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ట్రాన్స్ ఫర్ కూడా అవచ్చు. వ్యాపారంలో లాభాలు ఉంటాయి.
కుంభం (Aquarius): ఈ సమయంలో ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. మీ పనిపై శ్రద్ధ వహించండి. అలసట తప్పుడు పనులు చేయవద్దు. ఇతరులతో మర్యాదగా ఉండండి.
మీనం (Pisces) : ఈ సమయంలో మీరు ఆర్థికంగా మెరుగుపడతారు. ఎలాంటి ధన సమస్యలు ఉన్నా ఇప్పుడు అవి తొలగిపోతాయి. మీరు శాంతి మరియు ఆనందంతో జీవిస్తారు. భాగస్వామ్యంతో పని ప్రారంభించే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది.
Also Read: Navaratrulu 2022: నవరాత్రులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
బుధుడి తిరోగమనం మీ కెరీర్, ఆర్థిక స్థితిపై ఎలా ప్రభావం చూపుతుందో తెలుసా?