Virat Kohli 100 Matches: టీమ్ ఇండియా మాజీ రధ సారధి విరాట్ కోహ్లీ మరోసారి ఎంట్రీ ఇచ్చాడు. ఆసియా కప్ 2022లో పాకిస్తాన్‌తో జరిగే తొలి మ్యాచ్ కీలకం కానుంది. అది అతనికి వందవ మ్యాచ్ కావడం విశేషం..
దుబాయ్ ఇంటర్నేషనల్ స్డేడియంలో రేపు అంటే ఆగస్టు 28న జరిగే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ టీ20 ఆసియా కప్ మ్యాచ్ జరగనుంది. ఇంగ్లండ్ పర్యటన తరువాత వెస్టిండీస్, జింబాబ్వే పర్యటనకు దూరంగా ఉన్న విరాట్ కోహ్లీ మరోసారి ఆసియా కప్‌లో ఆడుతున్నాడు. అందుకే అందరి దృష్టి విరాట్ కోహ్లిపైనే పడింది. అంతేకాదు..ఆగస్టు 28వ జరిగే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ విరాట్ కోహ్లీకు 100వ టీ20 మ్యాచ్. దాదాపు నెలన్నర బ్రేక్ తరువాత ఆడనుండటంతో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
నాకెప్పుడూ ఇది అసాధారణమన్పించలేదు. బయటా..టీమ్‌లో కూడా చాలామంది నన్నడుగుతూ ఉంటారు. మీరు ఒత్తడిని ఎలా కంట్రోల్ చేసుకుంటారని..నేను సింపుల్‌గా ఒకటే చెబుతాను. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నా జట్టుకు విజయాన్ని అందించాలనుకుంటున్నాను. గ్రౌండ్ నుంచి బయటికొస్తే నా ఛాతీ ఉప్పొంగిపోతుందంటూ విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు.
ప్రతి మ్యాచ్‌లో వందశాతం ఆడాలని కోరుకునే ఆటగాడినని మరో సందర్భంలో విరాట్ వ్యాఖ్యానించాడు. మీరు గ్రౌండ్లో ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటారని, ఎలా జయిస్తారని చాలామంది అడుగుతుంటారని విరాట్ కోహ్లీ చెప్పాడు. నాకు క్రికెట్ ఆడటం ఇష్టం. నాకు ఈ ఆటంటే ఇష్టం. నాకు ప్రతి బౌల్‌కు సమాధానం చెప్పేందుకు చాలా ఉంది. గ్రౌండ్లో పూర్తి శక్తిని ప్రదర్శిస్తాను అని విరాట్ కోహ్లి తెలిపాడు.
Also read: Danish Kaneria: విరాట్ అంటే ఒక బ్రాండ్, గొప్ప పేరు కూడా..ఆసియా కప్ కీలకమే, కోహ్లీపై ప్రశంసలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook