Lemon Grass Tea: లెమన్ గ్రాస్ అనేది ఒక ఔషధ గుణాలున్న మూలిక.. దీనిని సైంబెపోగాన్ సిట్రాటస్ అనే శాస్త్రీయ నామంతో పిలుస్తారు. లెమన్ గ్రాస్ నిమ్మకాయ లాంటి సువాసను కలిగి ఉంటుంది. ఇది అనారోగ్య సమస్యలను దూరం చేసేందుకు ప్రధాన పాత్ర పోషిస్తుంది. దీనిని క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి, ఫోలేట్, ఫోలిక్ యాసిడ్, జింక్, మెగ్నీషియం, కాపర్, పొటాషియం, ఐరన్, ఫాస్పరస్, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలుంటాయి. కావున శరారంలోని రక్తంలో షుగర్ లెవెల్స్‌ను నియంత్రిస్తుంది. అయితే లెమన్ గ్రాస్‌ను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ నిమ్మరసం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..
1) కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది:
ప్రస్తుతం చాలా మంది చెడు కొలెస్ట్రాల్, గుండె పోటు, మధుమేహం బారిన పడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి పలు రకాల ఆహార నియమాలు పాటించడమేకాకుండా లెమన్ గ్రాస్‌ను వినియోగించాలని నిపుణులు తెలుపుతున్నారు. ఇలా చేయడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయి సులభంగా నియంత్రణలో ఉంటుందని నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు చెడు కొలెస్ట్రాల్, గుండె జబ్బుల నుంచి తగ్గించి రక్షణకలిపిస్తుంది.
2) బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను తగ్గిస్తుంది:
డయాబెటిస్తో బాధపడేవారు తప్పకుండా లెమన్ గ్రాస్ వినియోగించాలని నిపుణులు తెలుపుతున్నారు. ఇది రక్తంలో చక్కెర పరిమాణాలను తగ్గించేందుకు సహాయపడుతుంది. కావున మధుమేహంతో బాధపడుతున్నవారు లెమన్‌గ్రాస్ టీ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే వీరు రోజుకు రెండు సార్లు తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. లెమన్‌గ్రాస్‌లో 'సిట్రల్', 'లిమోనెన్', 'లినాలూల్' అనే పదార్ధాలు ఉంటాయి. ఇవి ఇన్సులిన్ స్థాయిలపై ప్రభావం చూపుతుంది. అంతేకాకుండా ఇది చాలా మందిలో రక్త పోటును కూడా నియంత్రిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. శరీరంలో లో గ్లూకోస్ టాలరెన్స్‌ను కూడా మెరుగుపరిచేందుకు దోహదపడుతుంది.
లెమన్ గ్రాస్ ఎలా ఉపయోగించాలి?
లెమన్ గ్రాస్‌తో టీ కూడా చేసుకుని తాగొచ్చు. అయితే దీనిని తయారు చేయడానికి.. లెమన్ గ్రాస్ టీని ఉదయాన్నే తాగడం వల్ల శరీరానికి మంచి ప్రయోజనాలు లభిస్తాయి. అంతేకాకుండా జలుబు, జ్వరం వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుందని నిపుణులు తెలుపుతున్నారు. దీనిని సలాడ్లలో కలుపుకుని కూడా తినవచ్చు. ఇలా దీనిని రోజూ తీసుకుంటే మధుమేహం, గుండె సమస్యలు దూరమవుతాయి.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also read: Diabetes Control Tips: ఆయుర్వేద చిట్కాలతో ఇలా మధుమేహానికి సులభంగా చెక్ పెట్టొచ్చు..
Also read: Diabetes Control Tips: ఆయుర్వేద చిట్కాలతో ఇలా మధుమేహానికి సులభంగా చెక్ పెట్టొచ్చు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook