BSNL Broadband Service gets just Rs 275 for 75 days: ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) తన వినియోగదారులను ఆకర్షించడానికి ఎప్పటికప్పుడూ కొత్త ప్లాన్లను అందించడానికి ప్రయత్నిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే అతి తక్కువ ధరకే బ్రాడ్‌బ్యాండ్ సేవలకు సంబంధించి కొత్త ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. కొత్త వినియోగదారులను ఆకట్టుకోవడంలో భాగంగా రూ. 275కే బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించనున్నట్లు ప్రకటించింది. అయితే ఈ ఆఫర్ బీఎస్ఎన్ఎల్ అందించే ప్రతి ప్లాన్‌కు వర్తించదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఆఫర్‌ను (రూ. 275కే బ్రాడ్‌బ్యాండ్ సేవలు) బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. అయితే తొలి 75 రోజుల వరకే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఆపై ప్లాన్ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. సింపుల్‌గా చెప్పాలంటే.. కొత్తగా బ్రాడ్‌బ్యాండ్ తీసుకునే వినియోగదారులకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. బీఎస్ఎన్ఎల్ ఎంట్రీ లెవల్ ప్లాన్లు రూ.449, రూ.599కు ఈ ఆఫర్ వర్తిస్తుంది. తొలి 75 రోజుల పాటు ఈ ప్లాన్లు రూ. 275కే అందిస్తారు.
వినియోగదారులు రూ. 449 ప్లాన్‌పై 30 ఎంబీపీఎస్ వేగంతో.. 3.3 టీబీ నెలవారీ డేటా పొందొచ్చు. ఈ డేటా పరిమితి దాటాక వేగం 2 ఎంబీపీఎస్‌కు తగ్గుతుంది. రూ. 599 ప్లాన్‌పై 60 ఎంబీపీఎస్ వేగంతో.. 3.3 టీబీ డేటాను పొందొచ్చు. నెలవారీ పరిమితి డేటా దాటాక వేగం 2 ఎంబీపీఎస్‌కు పడిపోతుంది. ఇక రూ. 999 ప్లాన్‌పై తొలి 75 రోజుల పాటు రూ.775 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్లాన్‌లో 150 ఎంబీపీఎస్ వేగంను 2 టీబీ వరకు పొందవచ్చు.
వినియోగదారులు రూ. 999 ప్లాన్‌లో ఓటీటీ ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఈ ప్లాన్‌లో డిస్నీ+ హాట్‌స్టార్, హంగామా, సోనీలివ్, జీ5, వూట్, యుప్‌టీవీ, లయన్స్‌గేట్ ఓటీటీలు ఫ్రీగా లభిస్తాయి. ఈ ప్లాన్‌లు అన్ని సెప్టెంబర్ 13 వరకు మాత్రమే వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి. బ్రాడ్‌బ్యాండ్ విభాగంలో ఇతర టెలికాం సంస్థలకు బీఎస్ఎన్ఎల్ గట్టి పోటీ ఇస్తోంది. డేటా ఉపయోగించుకునే వారికి ఈ ఆఫర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
Also Read: నైట్ వేర్‌లో క్లివేజ్ అందాలు.. సెగలు పెట్టిస్తున్న డింపుల్ హయాతి!
Also Read: భారత్ vs జింబాబ్వే డ్రీమ్ 11 టీమ్.. మ్యాచ్ టైమింగ్స్, స్ట్రీమింగ్ డీటెయిల్స్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook