SBI: ఎస్‌బీఐ ఖాతాదారులకు శుభవార్త..అందుబాటులోకి మరిన్ని సేవలు..!

SBI: దేశీయ అతిపెద్ద బ్యాంక్‌ స్టేట్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా(SBI) కీలక నిర్ణయం తీసుకుంది. తన ఖాతాదారుల కోసం కొత్త సేవలను తీసుకొచ్చింది.

Written by - Alla Swamy | Last Updated : Jun 25, 2022, 04:51 PM IST
  • ఎస్‌బీఐ కీలక నిర్ణయం
  • ఖాతాదారుల కోసం కొత్త సేవలు
  • అందుబాటులోకి కొత్త టోల్ ఫ్రీ నెంబర్‌
SBI: ఎస్‌బీఐ ఖాతాదారులకు శుభవార్త..అందుబాటులోకి మరిన్ని సేవలు..!

SBI: దేశీయ అతిపెద్ద బ్యాంక్‌ స్టేట్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా(SBI) కీలక నిర్ణయం తీసుకుంది. తన ఖాతాదారుల కోసం కొత్త సేవలను తీసుకొచ్చింది. ఇందుకోసం ఓ కొత్త టోల్ ఫ్రీ నెంబర్‌ను అందుబాటులో ఉంచింది. ఈనెంబర్‌కు ఫోన్ చేయడం ద్వారా ఖాతాదారులు ఆర్థిక లావాదేవీలను సులువుగా తీసుకోవచ్చు. గతంలోలాగా ప్రతిసారి బ్యాంక్‌కు వెళ్లాల్సిన పరిస్థితి ఉండదు. దీంతో సమయం కూడా ఆదా అవుతుంది. ఎస్‌బీఐ 1800 1234 కొత్త ట్రోల్‌ ఫ్రీ నెంబర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

సులువుగా గుర్తు పెట్టుకునే విధంగా నెంబర్‌ను తీసుకొచ్చారు. అత్యవసర సమయంలో బ్యాంకింగ్‌ సాయం తీసుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని బ్యాంకు అధికారులు తెలిపారు. 1800 1234 కొత్త ట్రోల్‌ ఫ్రీ నెంబర్‌ ఉపయోగించి ఖాతా బ్యాలెన్స్, ఖాతా స్టేటస్, ఏటీఎం లావాదేవీలు, ఏటీఎం కార్డ్ బ్లాకింగ్, డిస్పాచ్ స్టేటస్,టీడీఎస్ వివరాలు, చెక్‌బుక్ డిస్పాచ్ స్టేటస్, పాత ఏటీఎం కార్డు బ్లాక్ చేయడం, డిపాజిట్ వడ్డీసర్టిఫికెట్, పాత కార్డు బ్లాక్ చేసిన తర్వాత కొత్త ఏటీఎం కార్డులకు దరఖాస్తు చేసుకోవడం వంటి సేవలను పొందేందుకు మరింత సులువు అవుతుంది.

కొత్త ట్రోల్‌ ఫ్రీ నెంబర్‌ సేవలు 24 గంటలపాటు అందుబాటులో ఉంటాయి. 1800 1234తోపాటు 1800 11 2211, 1800 425 3800, 1800 2100, 080-26599990 నెంబర్‌ ద్వారా బ్యాంక్ లావాదేవీల గురించి తెలుసుకునే అవకాశం ఉంది. ఫోన్‌ కాల్‌తోపాటు ఈమెయిల్ ద్వారా సేవలను పొందేందుకు ఎస్‌బీఐ బ్యాంక్ అధికారులు ఏర్పాట్లు చేశారు. customercare@sbi.co.in, contactcentre@sbi.co.in మెయిల్ ఐడీలకు ఫిర్యాదులు పంపొచ్చని తెలిపారు. ఫిర్యాదు రిజిస్టర్ అయ్యాక సంబంధిత సమాచారం ఖాతాదారుడికి మెయిల్‌లో కానీ.. ఫోన్‌లో కానీ..సమాచారం అందుతుంది.

ఎస్‌ఎంఎస్ ద్వారా ఖాతాదారులు తమ సమస్యలను పరిష్కరించుకునే ఏర్పాటు చేశారు. HELP అని టైప్ చేసి +91 8108511111కి ఎస్‌ఎంఎస్ చేయాలి. తర్వాత బ్యాంక్‌ నుంచి సమాచారం వస్తుంది. దీనిపై సంతృప్తి చెందని ఖాతాదారుడు UNHAPPy అని టైప్‌ చేసి 8008202020కి ఎస్‌ఎంఎస్‌ పంపాలి. ఇలా చేయడం వల్ల సులువుగా సమస్యలను పరిష్కరించుకోవచ్చు. ఏటీఎం కార్డులు పొగొట్టుకన్నా..చోరీకి గురైనా ఈజీగా బ్యాంక్‌ను సంప్రదించుకునే అవకాశం ఉంది. రిజిస్టర్ట్ మొబైల్ నెంబర్ నుంచి సబ్‌ BLOCK తర్వాత కార్డు నెంబర్‌ టైప్‌ చేసి 567676కి పంపాలి. బ్యాంక్‌ స్టేట్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా(SBI) తీసుకొచ్చిన సేవలపై ఖాతాదారుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.

Also read: Chandrababu on CM Jagan: కూల్చివేతలు తప్ప నిర్మించడం జగన్‌కు సాధ్యం కాదు..చంద్రబాబు ధ్వజం..!

Also read:India vs Ireland: రేపే టీమిండియా, ఐర్లాండ్ మధ్య తొలి టీ20 మ్యాచ్‌.. తుది జట్టు ఇదే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News