KGF 2 Collection: బాక్సాఫీసు వద్ద దూసుకుపోతున్న 'కేజీఎఫ్ 2'.. 'బాహుబలి' రికార్డులను కొల్లగొట్టేనా?

KGF 2 Collection: డైరెక్టర్ ప్రశాంత్ నీల్, హీరో యష్ కాంబినేషన్ లో రూపొందిన చిత్రం 'కేజీఎఫ్ 2'.. ఇటీవలే థియేటర్లలో విడుదలై ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ లో ఇప్పుడు 'కేజీఎఫ్ 2' మూవీ మరో మైలురాయిని చేరుకుంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : May 18, 2022, 05:19 PM IST
KGF 2 Collection: బాక్సాఫీసు వద్ద దూసుకుపోతున్న 'కేజీఎఫ్ 2'.. 'బాహుబలి' రికార్డులను కొల్లగొట్టేనా?

KGF 2 Collection: కన్నడ స్టార్ హీరో యష్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపొందిన చిత్రం 'కేజీఎఫ్'. ఈ సిరీస్ లోని తొలి భాగాన్ని 2018లో విడుదల చేయగా.. ఇప్పుడా సినిమాకు రూపొందిన సీక్వెల్ 'కేజీఎఫ్ 2' ఇటీవలే రిలీజయ్యి ఘనవిజయం సాధించింది. బాక్సాఫీసు వధ్ద కలెక్షన్స్ అత్యధిక కలెక్షన్స్ సాధిస్తూ దూసుకుపోతుంది. బాలీవుడ్ చరిత్రలో ఇప్పటి వరకు అత్యధిక కలెక్షన్స్ సాధించిన రెండో చిత్రంగా ('బాహుబలి 2' తర్వాత) 'కేజీఎఫ్ ఛాప్టర్ 2' మూవీ నిలిచింది.   

ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న 'కేజీఎఫ్ 2' గత వారమే రూ. 1,100 కోట్ల వసూళ్లను సాధించింది. ఇప్పుడీ చిత్రం కలెక్షన్స్ లో మరో మైలురాయిని చేరుకుంది. ఇప్పుడు కలెక్షన్స్ లో రూ. 1,200 కోట్ల మైలురాయిని అధిగమించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్స్ సాధించిన మూడో భారతీయ చిత్రంగా 'కేజీఎఫ్ 2' సరికొత్త రికార్డును సృష్టించింది.

ప్రపంచవ్యాప్తంగా 'కేజీఎఫ్ 2' కలెక్షన్స్..

ట్రేడ్ అనలిస్ట్ మనోబాల విజయబాలన్ తన ట్విట్టర్ ఖాతాలో తెలిపిన వివరాల ప్రకారం.. 'కేజీఎఫ్ ఛాప్టర్ 2' తొలి వారంలో రూ. 720.31 కోట్లు సాధించగా.. రెండో వారం రూ. 223.51 కోట్లు.. రెండు వారాల్లోనే రూ. 1,000 కోట్ల కలెక్షన్స్ మార్క్ ను చేరుకుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రూ. 1,205 కోట్లకు పైగా వసూళ్లను సాధించినట్లు ఆయన తెలిపారు. 

అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్..

పాన్-ఇండియా స్థాయిలో బ్లాక్‌బస్టర్ గా నిలిచిన  'KGF చాప్టర్ 2' మూవీ ఇప్పుడు ఓటీటీలో కూడా అందుబాటులో ఉంది. పే పర్ వ్యూ విధానంలో డబ్బు చెల్లించి ఒక్కసారి సినిమాను చూసేందుకు అమెజాన్ ప్రైమ్ డిజిటల్ వేదిక అవకాశాన్ని కల్పించింది. 

Also Read: Keerthy Suresh Photos: బ్లాక్ అండ్ ఎల్లో డ్రస్సుల్లో అందాల సుందరిగా కీర్తి సురేష్!

ALso Read: Fatima Sana Shaikh Photos: బ్లాక్ అండ్ వైట్ గౌనులో కట్టిపడేస్తున్న ఖాన్ ప్రేయసి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News