SunRisers Hyderabad Pacer Umran Malik bowled fastest ball of IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022లో జమ్మూ కశ్మీర్ యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) తరఫున ఆడుతున్న ఉమ్రాన్.. ప్రత్యర్థి బ్యాటర్లను తన అద్భుత బంతులతో హడలెత్తిస్తున్నాడు. 22 ఏళ్ల యువ పేసర్ వేసే బంతులకు ఒక్కోసారి ప్రత్యర్థి బ్యాటర్ల వద్ద సమాధానమే లేకుండా పోతోంది. అత్యంత వేగవంతమైన బంతులతో బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్ 2022లో అత్యంత వేగవంతమైన బంతిని సంధించిన బౌలర్‌గా ఉమ్రాన్ రికార్డుల్లో నిలిచాడు.
శనివారం డివై పాటిల్ మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ పేసర్ ఉమ్రాన్ మాలిక్.. గంటకు 153.1 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిన బంతిని సంధించాడు. దీంతో ఐపీఎల్ 2022లో ఇప్పటివరకు అత్యంత వేగవంతమైన బంతిని విసిరిన బౌలర్‌గా ఉమ్రాన్ నిలిచాడు. చెన్నై ఇన్నింగ్స్‌లో భాగంగా తొమ్మిదో ఓవర్ మొదటి బంతిని గంటకు 153.1 కిలోమీటర్ల వేగంతో విసిరాడు. అంతకుముందు విరిసిన బంతిని కూడా ఉమ్రాన్ గంటకు 152 కిలోమీటర్ల వేగంతో విసిరాడు. 13వ ఓవర్లో కూడా ఉమ్రాన్ 150, 152 వేగంతో బంతులు వేశాడు. ఐపీఎల్ 2021లో కూడా ఉమ్రాన్ గంటకు 153 కిలోమీటర్ల వేగంతో బంతిని వేశాడు.
ఐపీఎల్‌లో అత్యంత వేగవంతమైన బంతిని విసిరిన రికార్డు దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ అన్రిచ్ నోర్జ్ పేరుపై ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్న నోర్జ్.. ఐపీఎల్ 2020లో గంటకు 156.2 కిలోమీటర్ల వేగంతో బంతిని సందించాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ పేసర్ ఈ రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్ చరిత్రలో మొదటి మూడు వేగవంతమైన బంతులు (156.2, 155.21, 154.74) నోర్జ్ పేరిటే ఉండడం విశేషం. ఈ జాబితాలో డేల్ స్టెయిన్ (154.4 గంటకు కిలోమీటర్లు) రెండో స్థానంలో ఉండగా.. ఉమ్రాన్ మాలిక్ మూడో స్థానంలో ఉన్నాడు.
జమ్మూ ఎక్స్‌ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ వేగంగా బంతులు వేస్తున్నా.. పరుగులు కూడా ఇస్తున్నాడు. అయితే తన వేగానికి టెక్నిక్ జోడిస్తేవికెట్లు కూడా వస్తాయి. క్రికెట్ పండితులు కూడా ఇదే అభిప్రాయపడుతున్నారు. 22 ఏళ్ల ఉమ్రాన్ తన బౌలింగ్‌కు మెరుగులు దిద్దుకుంటే.. భవిష్యత్తులో టీమిండియాకు ఓ సూపర్ ఫాస్ట్ బౌలర్‌గా ఎదుగుతాడని మాజీలు అంటున్నారు. ఐపీఎల్ టోర్నీలో ఆకట్టుకుంటున్న ఉమ్రాన్.. త్వరలోనే భారత జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Also Read: Governor Tamilsai: తెలంగాణ గవర్నర్‌ను అనకూడని మాటన్న నెటిజన్!
Also Read: Rahul Tewatia: ఎంఎస్ ధోనీ తర్వాత.. ఆ రికార్డు రాహుల్ తెవాటియాదే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook