Uttar Pradesh New Cabinet: ఉత్తరప్రదేశ్‌లో గత చరిత్రను తిరగరాస్తూ వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ... ఇప్పుడు కేబినెట్ కూర్పుపై ఫోకస్ పెట్టింది. సామాజిక, ప్రాంతీయ సమీకరణాలను బ్యాలెన్స్ చేస్తూ కేబినెట్‌ను ఏర్పాటు చేసే యోచనలో ఉంది. ఈసారి దళిత నేతకు డిప్యూటీ సీఎం పదవితో పాటు ఆ సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు కేబినెట్లో ప్రాధాన్యతినచ్చే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. డిప్యూటీ సీఎంల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందంటున్నారు.
ఇటీవలి ఎన్నికల్లో బీజేపీకి చెందిన 11 మంది మంత్రులు ఓటమిపాలవడంతో.. ఈసారి కేబినెట్లో 11 మంది కొత్తవారికి అవకాశం దక్కవచ్చునని చెబుతున్నారు. కొత్తగా కేబినెట్లో చోటు దక్కించుకునేవారిలో కన్నౌజ్ నుంచి గెలిచిన రిటైర్డ్ ఐపీఎస్ ఆసిం అరుణ్, ఆగ్రా రూరల్ నుంచి గెలుపొందిన బేబీ రాణి మౌర్యల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కేబినెట్లో వీరికి కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఎమ్మెల్సీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్, లక్నో సరోజిని నగర్ నుంచి గెలిచిన రాజేశ్వర్ సింగ్, రిటైర్డ్ ఐఏఎస్, ఎమ్మెల్సీ ఏకే శర్మలకు కూడా కేబినెట్లో చోటు దక్కవచ్చునని అంటున్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యకు మరోసారి కేబినెట్లో బెర్త్ ఖాయమంటున్నారు. ఇక మిత్రపక్షాలైన అప్నాదల్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ ఆశిష్ పటేల్, నిషద్ పార్టీ నుంచి డా.సంజయ్ నిషద్లకు మంత్రి పదవులు దక్కే అవకాశం ఉందంటున్నారు.
ఢిల్లీ వేదికగా త్వరలో జరగబోయే పార్టీ సమావేశంలో కేబినెట్ కూర్పుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కేబినెట్ కూర్పుపై బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఇద్దరు అబ్జర్వర్లను నియమించనున్నట్లు తెలుస్తోంది. అబ్జర్వర్లు ఇచ్చే నివేదికపై ఢిల్లీలో జరగబోయే సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
కాగా, తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 403 స్థానాలకు గాను 255 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ మిత్రపక్షాలైన అప్నాదళ్, నిషద్ పార్టీ మరో 18 స్థానాల్లో విజయం సాధించాయి. తాజా విజయంతో యూపీలో 30 ఏళ్ల చరిత్రను బీజేపీ తిరగరాసినట్లయింది. ఇన్నేళ్ల చరిత్రలో యూపీలో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన పార్టీ బీజేపీయే కావడం విశేషం. బీజేపీపై ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉందని ప్రతిపక్షాలు ప్రచారం చేసినప్పటికీ.. ఎన్నికల ఫలితాలు మాత్రం అందుకు విరుద్ధంగానే వచ్చాయి.
Also Read: Radhe Shyam Collection: రాధే శ్యామ్ 2 రోజుల్లో రూ.119 కోట్ల వసూళ్లు- మూడో రోజు?
Also read: Radheshyam Collections: ప్రభాస్ ఫస్ట్ డే కలెక్షన్ లలో పుష్ప, భీమ్లానాయక్ లను దాటేసాడా..??
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook