Close Old Bank Accounts: ఆధునిక కాలంలో ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు వినియోగించే వాళ్లు ఉన్నారు. ఉద్యోగ రీత్యా అనేక కంపెనీల బదిలీ లేదా మార్పు కారణంగా.. శాలరీ కోసం బ్యాంకు ఖాతాలను మార్చాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో పాత బ్యాంకు ఖాతా జీరో అకౌంట్ నుంచి సేవింగ్స్ అకౌంట్ గా మారుతుంది.
దీంతో ఆ బ్యాంకు ఖాతాలో కనీస అమౌంట్ ను కొనసాగించాల్సి ఉంటుంది. లేకపోతే ఫైన్ చెల్లించాలి. ఈ నేపథ్యంలో అలాంటి నిరుపయోగంగా ఉన్న బ్యాంకు ఖాతాలను తక్షణమే క్లోజ్ చేయడం ఉత్తమం. లేకపోతే దాని వల్ల వచ్చే నష్టాలేంటో తెలుసుకోండి.
మీకూ అలాంటి సమస్య ఉంటే, మీరు వెంటనే పాత బ్యాంక్ ఖాతాలను మూసివేయాలి. అలా చేయకుంటే నష్టపోతారు. మీరు బ్యాంకు ఖాతాను సులభంగా ఎలా మూసివేయవచ్చో చూద్దాం.
బ్యాంకు ఖాతాలను ఎలా క్లోజ్ చేయాలంటే?
ఏ బ్యాంక్ సేవింగ్స్ ఖాతాను మూసివేయాలో నిర్ణయించేటప్పుడు, ఆ ఖాతా నుంచి మొత్తం డబ్బును విత్‌డ్రా చేసుకోవాలి. ATM లేదా ఆన్‌లైన్ ట్రాన్సఫర్ ద్వారా డబ్బును వేరే ఖాతాకు మళ్లించుకోవచ్చు. అయితే ఆ బ్యాంకు ఖాతాను డియాక్టివేట్ చేసే ముందు.. దానికి సంబంధించిన అన్ని డెబిట్ కార్డులు తప్పనిసరిగా డీలింక్ చేయాలి.
సాధారణంగా, 14 రోజులలోపు సేవింగ్స్ ఖాతాను మూసివేయడానికి బ్యాంకులు ఎటువంటి రుసుమును వసూలు చేయవు. 14 రోజుల నుంచి ఏడాది కాలం వరకు ఖాతాను క్లోజ్ చేసేందుకు ముగింపు ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకులు సాధారణంగా ఒక ఏడాది కంటే ఎక్కువ కాలానికి మూసివేయడానికి ఎటువంటి రుసుమును వసూలు చేయవు.
ఇలా చేయాలి..
మీ బ్యాంకు ఖాతాను మూసివేయడానికి మీరు తప్పనిసరిగా దానికి చెందిన శాఖకు వెళ్లాలి. అక్కడ బ్యాంకు ఖాతా క్లోజ్ చేసేందుకు దరఖాస్తు పూరించాలి. దీంతో పాటు మీరు తప్పనిసరిగా డీ-లింకింగ్ ఫారమ్ ను కూడా సమర్పించాలి. బ్యాంకు ఖాతాకు సంబంధించిన చెక్ బుక్, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్టులను తిరిగి ఇవ్వాలి.
Also Read: New Year 2022: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోవడానికి..ఇండియాలో బెస్ట్ ప్లేసెస్ ఏంటో తెలుసా?
Also Read: 5 rupees coin for Money : 5 రూపాయల నాణెంతో ఇలా చేస్తే కోట్లకు అధిపతులు అవుతారు, డబ్బే డబ్బే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook