Jr NTR, Mahesh Babu, Chiranjeevi's donations: ఏపీలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా పోటెత్తిన వరదలు జల ప్రళయం సృష్టించిన సంగతి తెలిసిందే. కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో వరదలు ఎంతో మందిని నిరాశ్రయులను చేశాయి. మరీ ముఖ్యంగా కడప, చిత్తూరు జిల్లాల్లో ఈ వరదల ప్రభావం అధికంగా కనిపించింది. తిరుపతిలోనైతే ఎన్నడూ చూడని విధంగా సప్తగిరులపై నుంచి కిందకు పోటెత్తిన వరద నీరు (Tirupati floods) జనజీవనాన్ని అస్తవ్యస్థం చేశాయి.
భారీ సంఖ్యలో జనం ఉండటానికి గూడు, తినడానికి తిండి లేకుండా కట్టుబట్టలతో రోడ్డునపడ్డారు. దీంతో ఏపీ సర్కారు వారికి స్థానికంగా సురక్షిత ప్రదేశాలకు తరలించి అక్కడే వారికి ఉండటానికి ఆశ్రయం కల్పించడంతో పాటు ఆహారం, నీరు అందిస్తోంది. ఈ క్రమంలోనే ఏపీలో వరద బాధితులకు సహాయం చేయడంలో ఏపీ సర్కారుతో పాటు తాము కూడా కలిసి నడుస్తామంటూ పలువురు సెలబ్రటిలు, వ్యాపార ప్రముఖులు ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి (AP CM relief fund) విరాళం అందిస్తున్నారు.
ఇప్పటికే అల్లు అరవింద్ లాంటి చిత్ర నిర్మాతలు తమ వంతు ఆర్థిక సహాయాన్ని ప్రకటించగా.. తాజాగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr Ntr's donation to AP flood victims) కూడా ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కి విరాళం ప్రకటిస్తూ ఓ ట్వీట్ చేశారు. వరద బాధితుల సహాయార్థం రూ. 25 లక్షలు ఆర్థిక సహాయం ప్రకటించిన తారక్.. వరద బాధితులను ఆదుకోవడంలో తన వంతుగా ఈ చిరు సాయం చేస్తున్నట్టు తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
Moved by the plight of people affected by the recent floods in Andhra Pradesh, I am contributing 25 lakhs as a small step to aid in their recovery.
— Jr NTR (@tarak9999) December 1, 2021
సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా వరద బాధితుల సహాయార్థం తన వంతు సాయాన్ని ప్రకటించారు. ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కి 25 లక్షల రూపాయలు విరాళం ప్రకటించిన మహేష్ బాబు (Mahesh Babu's donation to AP flood victims).. ఈ కష్టకాలంలో ప్రతీ ఒక్కరూ ముందుకొచ్చి వరద బాధితులకు అండగా నిలవాల్సిందిగా పిలుపునిచ్చారు.
In light of the devastating floods in Andhra Pradesh, I would like to contribute 25 lakhs towards the CMRF. Request everyone to come forward and help AP during this hour of crisis. 🙏@ysjagan @AndhraPradeshCM
— Mahesh Babu (@urstrulyMahesh) December 1, 2021
Also read : Ajith requests not to call him Thala : తల అని పిలవొద్దంటున్న హీరో అజిత్..కారణం ఏమిటో మరి!
తారక్ ట్వీట్ చేసిన కొద్దిసేపటికే మహేష్ బాబు ట్వీట్ చేయగా.. మహేష్ బాబు ట్వీట్ (Mahesh Babu knee surgery news updates) చేసిన కొద్దిసేపటికే మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ అంశంపై స్పందించారు. వరద బాధితుల కుటుంబాలకు సాయం చేయడంలో తన వంతుగా ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కి 25 లక్షల రూపాయలు విరాళం ప్రకటిస్తున్నట్టు చిరంజీవి ట్వీట్ (Chiranjeevi's donation to AP flood victims) చేశారు.
Pained by the wide spread devastation & havoc caused by floods & torrential Rains in Andhra Pradesh. Making a humble contribution of Rs.25 lacs towards Chief Minister Relief Fund to help aid relief works. @ysjagan @AndhraPradeshCM pic.twitter.com/cn0VImFYGJ
— Chiranjeevi Konidela (@KChiruTweets) December 1, 2021
Also read : Lakshya Trailer: లక్ష్య ట్రైలర్.. పడిలేచిన వాడితో పందెం రిస్కే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook