ఔరా అనిపిస్తున్న సీఎం కేసీఆర్ బర్త్ డే సాంగ్

సీఎం కేసీఆర్ బర్త్‌డే సాంగ్ పాడేందుకు గొంతు కలిపిన 18 మంది గాయకులు

Last Updated : Feb 17, 2018, 06:54 PM IST
ఔరా అనిపిస్తున్న సీఎం కేసీఆర్ బర్త్ డే సాంగ్

నేడు టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజుని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ అభిమానులు, టీఆర్ఎస్ పార్టీ కార్యక్తలు ఘనంగా ఆయన జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. కేసీఆర్ పుట్టిన రోజు నేపథ్యంలో ఆ ఉద్యమ నాయకుడిపై ప్రముఖ గాయకుడు, రచయిత గోరేటి వెంకన్న సాహిత్యంలో, బందూక్ సినిమా దర్శకుడు లక్ష్మణ్ తెరకెక్కించిన పాట ప్రస్తుతం నెట్ లో వైరల్ వీడియోగా మారింది. వీరాధి వీరుడు అతడు అంటూ సాగిన పాటలో కేసీఆర్ నైజాన్ని, ఆయన వ్యక్తిత్వాన్ని అద్భుతంగా ప్రశంసించారు.

5 నిమిషాల నిడివి కలిగిన ఈ పాటలో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన తీరుని కళ్లకు కట్టినట్టు ప్రదర్శించారు. మరి ఇంకెందుకు ఆలస్యం.. "వీరాధి వీరుడు అతడు"పై మీరూ ఓ లుక్కేసేయండి!!

 

Trending News