Bank Holidays In July 2021: కరోనా సెకండ్ వేవ్ తగ్గడంతో తెలంగాణలో లాక్‌డౌన్ ఎత్తివేయడంతో బ్యాంకులు యథాతథంగా సేవలు అందిస్తున్నాయి. ఏపీలో కర్ఫ్యూ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతోంది. అయితే ప్రజలకు ఆర్థిక లావాదేవిలు అందించేందుకు బ్యాంకులు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయి. సిబ్బంది విధులకు హాజరవుతున్నారు. జులై నెలలో బ్యాంకులు మొత్తం 15 రోజులపాటు సేవలు అందిచవు.
ఏవైనా బ్యాంకు పనులు ఉన్నవారు జులై నెలలో తమ రాష్ట్రాల్లో ఉన్న బ్యాంకు సెలవులను తెలుసుకుని పనులు షెడ్యూల్ చేసుకోవాలని అధికారులు సూచిన్తున్నారు. మరోవైపు కోవిడ్19 నిబంధనలు కచ్చితంగా పాటించాలని హెచ్చరిస్తున్నారు. జులైలో బ్యాంకు సెలవుల వివరాలను భారతీయ రిజర్వ్ బ్యాంక్ (Reserve Bank of India) అందించింది. నాలుగు ఆదివారాలతో పాటు రెండో మరియు నాలుగో శనివారాలు బ్యాంకు సిబ్బందికి సెలవు, ఆ రోజులలో బ్యాంకులు సేవలు అందించవు. అయితే రాష్ట్రాలను బట్టి ఆ పనిదినాలలో మార్పులు ఉంటాయని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.
Also Read: SBI New Charges: కస్టమర్లకు ఎస్‌బీఐ షాక్, జులై 1 నుంచి కొత్త ఛార్జీలు వసూలు
- జులై 4 - ఆదివారం
- జులై 10 - రెండో శనివారం
- జులై 11 - ఆదివారం
- జులై 18 - ఆదివారం
- జులై 24 - నాలుగో శనివారం
- జులై 25 - ఆదివారం
Also Read: SBI Customers Alert: ఎస్‌బీఐ ఖాతాదారులకు సరికొత్త సౌకర్యం, ఏ ఛార్జీలు వసూలు చేయరు
- జులై 12 - కాంగ్ (రథజత్ర) / రథయాత్ర
- జులై 13 - భాను జయంతి
- జులై 14 - దృక్ప శేచి
- జులై 16 - హరేల
- జులై 17 - యు టిరోట్ సింగ్ డే/ కర్చీ పూజ
- జులై 19 - గురు రింపోచి తుంగ్ కార్ శేచి
- జులై 20 - బక్రీద్
- జులై 21 - బక్రి ఈద్ (ఈద్ ఉల్ జుహా) (ఈద్ ఉల్ అదా)
- జులై 31 - కేర్ పూజ
Also Read: SBI Mobile Number Change: బ్యాంకుకు వెళ్లకుండా ఎస్‌బీఐ మొబైల్ నెంబర్ ఇలా చేంజ్ చేసుకోండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Bank Holidays In July 2021: జులై నెలలో 15 రోజులపాటు బ్యాంకులు బంద్, వివరాలివే