LIC Jeevan Labh Policy: ఎల్ఐసీ జీవన్ లాభ్ పాలసీతో డెత్ బెనిఫిట్, Maturity Benefit, పాలసీ వ్యవధి పూర్తి వివరాలు

LIC Jeevan Labh Policy: ఎల్ఐసీ పలు రకాల పాలసీలను అందిస్తోంది. అందులో ఎల్‌ఐసీ జీవన్ లాభ్(LIC Jeevan Labh) ప్రీమియం గురించి ఈరోజు తెలుసుకుందాం. ఇందులో సురక్షతో పాటు సేవింగ్స్ ప్రయోజనాలు పొందవచ్చు.

Written by - Shankar Dukanam | Last Updated : Mar 19, 2021, 02:57 PM IST
LIC Jeevan Labh Policy: ఎల్ఐసీ జీవన్ లాభ్ పాలసీతో డెత్ బెనిఫిట్, Maturity Benefit, పాలసీ వ్యవధి పూర్తి వివరాలు

LIC Jeevan Labh Policy: ఇన్సూరెన్స్ దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC) పలు రకాల పాలసీలను అందిస్తోంది. అందులో ఎల్‌ఐసీ జీవన్ లాభ్(LIC Jeevan Labh) ప్రీమియం గురించి ఈరోజు తెలుసుకుందాం. ఇందులో సురక్షతో పాటు సేవింగ్స్ ప్రయోజనాలు పొందవచ్చు.

ఎల్ఐసీ జీవన్ లాభ్ పాలసీతో ఆర్థిక భరోసా, అనుకోకుండా మరణం సంభవిస్తే భారీ మొత్తంలో నగదును పాలసీదారుల కుటుంబసభ్యులకు, నామినీకి అందిస్తారు. ఈ పాలసీ తీసుకున్న వారు కొంతకాలం తరువాత రుణాలు సైతం అందుకునే సౌలభ్యాన్ని LIC కల్పించింది. డెత్ బెనిఫిట్, పాలసీ మెచ్యూరిటీ బెనిఫిట్స్ సహా ఎల్ఐసీ జీవన్ లాభ్ పాలసీ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

Also Read: EPFO Good News: జాబ్ మానేశాక EPF ఖాతా నుంచి నగదు డ్రా చేయవద్దు, ఆ కారణాలు మీకోసం

1. డెత్ బెనిఫిట్ (Death benefit): పాలసీ నడుస్తుండగా మధ్య కాలంలోనే పాలసీదారుడు మరణిస్తే, చెల్లించిన అన్ని ప్రీమియంలు తిరిగి ఇచ్చేస్తారు. డెత్ బెనిఫిట్ ప్రయోజనాలు అందిస్తారు. బోనస్,  స్వయంసిద్ధ సింపుల్ రివర్షనరీ బోనస్ మరియు ఇతరత్రా ఏదైనా బోనస్‌లు ఉంటే బాధితుడి కుటుంబాలకు అందుతాయి.

2. మరణంపై హామీ ఇవ్వబడిన మొత్తం చెల్లిస్తారు. అయితే ఇది వార్షిక ప్రీమియం యొక్క మొత్తం నగదుకు 10 రెట్లు ఎక్కువ లేదా మరణంపై చెల్లించాల్సిన మొత్తం అని ఎల్‌ఐసీ జీవన్ లాభ్ పాలసీలో పేర్కొన్న నగదును ఎల్ఐసీ అందిస్తుంది.

Also Read: Gold Price Today: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు జోష్, వెండి ధరలు పైపైకి

3. ఈ డెత్ బెనిఫిట్ అనేది చనిపోయే నాటికి పాలసీదారుడు చెల్లించిన మొత్తం ప్రీమియం కన్నా 105 శాతం కంటే తక్కువ ఉండకూడదు.

4. మెచ్యూరిటీ బెనిఫిట్ (Maturity Benefit): పాలసీ చివరి నెల వరకు వాయిదాలు చెల్లిస్తే మెచ్యూరిటీ బెనిఫిట్స్ పొందుతారు. దీనిని బేసిక్ సమ్ అషూర్డ్‌కు సమానమైన మొత్తంగా నిర్వచిస్తారు. పాలసీ నిర్ణీత గడువు ముగిసిన తరువాత ఒకేసారి మొత్తంగా నగదును పాలసీదారుడికి సంస్థ అందిస్తుంది. ఇతర ప్రయోజనాలు ఏమైనా ఉంటే వాటిని కూడా ఇస్తుంది.

5. జీవిత భీమా సంస్థ (Life Insurance Corporation) లాభాలకు అనుగుణంగా పాలసీ మొత్తం నగదును నిర్ణయిస్తుంది. గతంలో ప్రకటించిన సాధారణ రివర్షనరీ బోనస్‌లను స్వీకరించడానికి అర్హత ఉంటుంది.

6. ఆప్షనల్ బెనిఫిట్ (Optional Benefit): పాలసీదారునికి ఎల్‌ఐసీ యొక్క యాక్సిడెంటల్ డెత్ అండ్ డిసేబిలిటీ బెనిఫిట్ రైడర్, ఎల్‌ఐసి యొక్క న్యూ టర్మ్ అస్యూరెన్స్ రైడర్‌ను పొందే అవకాశం ఉంది. కానీ వాహనదారుడికి మొత్తం హామీ ఇవ్వబడిన ప్రాథమిక నగదు మొత్తాన్ని మించదు.

Also Read: 7th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు DA Hike మరియు డీఆర్ చెల్లింపులపై కీలక నిర్ణయం

7. కనీస మొత్తం హామీ: రూ.2 లక్షలు

8. గరిష్ట మొత్తం హామీ: దీనికి పరిమితి ఉండదు

9. పాలసీ కాల వ్యవధి: 16, 21 మరియు 25 సంవత్సరాలు పాలసీలు

10. ప్రీమియం చెల్లించాల్సిన కాలం: 10, 15 మరియు 16 సంవత్సరాల పాలసీలు

మరిన్ని వివరాలు LIC సేల్స్ బ్రోచర్‌లో లభిస్తాయి.  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News