Visakhapatnam steel plant issue: స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి అవసరమైతే రాజీనామాలకు సిద్ధం: విశాఖ ఎంపీ

Visakhapatnam steel plant issue: విశాఖ స్టీల్‌ప్లాంట్ పరిరక్షణకు అవసరమైతే రాజీనామాలకు సిద్ఘమంటున్నారు వైసీపీ ఎంపీలు. దక్షిణాది రాష్ట్రాలంటే కేంద్రానికి చిన్నచూపని..వివక్ష చూపుతున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్ విమర్శించారు.  

Last Updated : Feb 18, 2021, 10:28 PM IST
Visakhapatnam steel plant issue: స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి అవసరమైతే  రాజీనామాలకు సిద్ధం: విశాఖ ఎంపీ

Visakhapatnam steel plant issue: విశాఖ స్టీల్‌ప్లాంట్ పరిరక్షణకు అవసరమైతే రాజీనామాలకు సిద్ఘమంటున్నారు వైసీపీ ఎంపీలు. దక్షిణాది రాష్ట్రాలంటే కేంద్రానికి చిన్నచూపని..వివక్ష చూపుతున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్ విమర్శించారు.

విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ( Visakha steel plant privatisation )కు వ్యతిరేకంగా ఉద్యమం తీవ్రమవుతోంది. అధికారపార్టీ నేతలు ప్రత్యక్షంగా పాల్గొంటూ ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తున్నారు. కడప స్టీల్‌‌ప్లాంట్‌ అనేది విభజన చట్టం హామీలోనే ఉందని, ఇప్పుడు దాన్ని ప్రైవేట్‌‌పరం చేయాలని చూస్తున్నారని మంత్రి అవంతి శ్రీనివాసరావు ( Minister avanthi srinivas ) విమర్శించారు.దక్షిణాది రాష్ట్రాలంటే చిన్నచూపని, హిందీ మాట్లాడేవాళ్ళు మాత్రమే భారతీయులు అనే వివక్షత ఉందని ఆరోపించారు. స్టీల్‌‌ప్లాంట్‌ విషయంలో పార్టీలకతీతంగా అందరం కలిసికట్టుగా పోరాటం చేయాలని విఙ్ఞప్తి చేశారు. మార్చి 5నుంచి జరిగే బడ్జెట్‌ సమావేశాల్లో ఈ సమస్యను లేవనెత్తాలని తెలిపారు. విశాఖ స్టీల్‌‌ప్లాంట్‌పై అసెంబ్లీలో తీర్మానం చేస్తామని, విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో పోస్కో కంపెనీని అడుగు పెట్టనివ్వమని ఇప్పటికే సీఎం జగన్‌( Ap cm ys jagan )స్పష్టం చేసినట్లు వివరించారు. సోషల్‌ మీడియా వేదికగా ప్రపంచంలోని తెలుగు వారందరూ ముందుకు వచ్చి విశాఖ స్టీల్‌‌ప్లాంట్‌ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లాలని కోరారు. 

స్టీల్‌‌ప్లాంట్‌ ఉద్యమాని( Steel plant protest )కి అవసరమైతే రాజీనామాకు కూడా సిద్ధమని విశాఖ ఎంపీ ఎం.వి.వి సత్యనారాయణ అన్నారు. ఈ విషయంపై ఢిల్లీలో పోరాటం చేస్తామని, అక్కడ కూడా విఫలమైతే తక్షణమే  పదవికి రాజీనామా చేస్తామని ప్రకటించారు. వంద మంది ఎంపీలున్న కాంగ్రెస్ పార్టీ విశాఖ స్టీల్‌ప్లాంట్ కోసం  ఎందుకు మాట్లాడలేదని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌ను ప్రశ్నించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ రుణాల్ని ఈక్విటీ షేర్లుగా మారిస్తే ప్రయోజనం ఉంటుందని సూచించారు. 

Also read: Visakhapatnam land scam: విశాఖ భూకుంభకోణమంతా ఆ 126 ఎన్ఓసీలపైనే, కొనసాగుతున్న సిట్ దర్యాప్తు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News