Telangana: తెలంగాణలో జరుగుతున్న పరిణామాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. ముఖ్యమంత్రి పదవి..నాగార్జున సాగర్ ఉప ఎన్నికలపై ఆయన మాట్లాడారు. కొంతమందికి పరోక్షంగా హెచ్చరిక జారీ చేశారు.
తెలంగాణ ( Telangana ) లో గత కొద్దికాలంగా ముఖ్యమంత్రి మారనున్నారనే ప్రచారం సాగుతోంది. కేటీఆర్ ( KTR ) కాబోయే ముఖ్యమంత్రి అంటూ ప్రచారం ఊపందుకుంది. మంత్రులు కూడా ఈ విషయంపై ప్రకటనలు చేసిన సందర్భముంది. మరోవైపు నాగార్జున సాగర్ ఉపఎన్నిక ( Nagarjuna sagar bypoll ) అంశముంది. ఈ విషయాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ( Cm kcr ) స్పందించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్‌కు ఎవరూ పోటీ లేరని స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. పలు విషయాలపై స్పష్టత ఇచ్చారు. నాగార్జున సాగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ ( TRS ) విజయం సాధిస్తుందని తెలిపారు.
తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని..ముఖ్యమంత్రిగా కొనసాగుతానని స్పష్టం చేశారు. ఈ విషయంపై ఎక్కడా ఎటువంటి వ్యాఖ్యలు చేయవద్దని సూచించారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మరోవైపు జీహెచ్ఎంసీ మేయర్ అభ్యర్ధిని సీల్డ్ కవర్ ద్వారా అదే రోజు ప్రకటిస్తామన్నారు. ఈ నెల 11వ తేదీన మేయర్ ఎన్నిక ( Ghmc Mayor Elections )లకు ఎక్స్‌అఫీషియో సభ్యులు, కార్పొరేటర్లతో కలిసి జీహెచ్ఎంసీకు వెళ్లాలని కేసీఆర్ సూచించారు. పార్టీ బలపర్చిన అభ్యర్ధికే ఓటు వేయాలని సీఎం కేసీఆర్ తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Telangana: ముఖ్యమంత్రి మార్పు లేదు..వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు