చింత చచ్చినా పులుపు చావలేదనేది అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ( Donald Trump ) కు సరిగ్గా సరిపోతుంది. ఎన్నికల్లో ఓటమి ఎదురైనా ఇంకా నేనే గెలిచానని మాట్లాడుతున్నారు. ఐ వన్ ది ఎలక్షన్ అంటూ ట్వీట్ చేసి అభాసుపాలవుతున్నారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న డోనాల్డ్ ట్రంప్..ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. ఓటమిని అంగీకరించేది లేదంటున్నారు. ఈ నేపధ్యంలో సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు మరింతగా అభాసుపాలు చేస్తున్నాయి. జో బిడెన్ ( Joe Biden ) గెల్చినట్టు అంగీకరిస్తూనే..మరోవైపు అధ్యక్ష పీఠం కోసం మోసాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ..నేనే గెలిచానంటూ ట్వీట్ ( Trump Tweet ) చేయడం ఇందుకు నిదర్శనం. ట్రంప్ చేసిన ఈ ట్వీట్ పై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అటు ట్విట్టర్ కూడా ట్రంప్ ట్వీట్ ను ఫ్లాగ్ చేసింది. ఈ పోస్ట కింద ఓ హెచ్చరిక కూడా జారీ చేసింది.
I WON THE ELECTION!
— Donald J. Trump (@realDonaldTrump) November 16, 2020
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ( America president Elections ) గెలిచిన డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధి జో బిడెన్ ( Democratic party candidate Joe Biden ) ముందు ప్రకటించినట్టుగా 306 ఎలక్టోరల్ ఓట్లు దక్కించుకున్నారు. రిపబ్లికన్ పార్టీ ( Republican party ) అభ్యర్ధి, ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ( Donald Trump ) 232 ఓట్లకు పరిమితమయ్యారు. కావల్సిన మ్యాజిక్ ఫిగర్ కంటే జో బిడెన్ 36 ఓట్లు అధికంగా తెచ్చుకున్నారు. ఇప్పటికైనా ఓటమిని అంగీకరించాలని మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ( Barack Obama ) సైతం ట్రంప్ కు సూచించారు. ఫలితాల్ని మార్చే అవకాశం లేదని..ఇప్పటికైనా అహం వీడి..దేశ ప్రయోజనాల కోసం బాధ్యతగా వ్యవహరించాలంటూ హితవు పలికారు. డోనాల్ట్ ట్రంప్ నిరంతరం అదే పనిగా అసత్యాలు ప్రచారం చేస్తే..అమెరికా బలహీనపడిందని ప్రత్యర్ధి దేశాలు భావిస్తాయని ఒబామా సూచించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G , Apple Link - https://apple.co/3loQYe.
మరిన్ని అప్‌డేట్స్ కోసం https://www.facebook.com/ZeeHindustanTelugu పేజీని లైక్ చేయండి, ట్విటర్‌లో https://twitter.com/ZeeHTelugu పేజీని ఫాలో అవండి
Also read: Pink diamond: అరుదైన పింక్ డైమండ్ ధర ఎంతో తెలుసా ?