BJP MP Gautam Gambhir self isolated: న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, రాజకీయ నేతలు, ఇతర ప్రముఖులు వరకు అందరూ కూడా కరోనావైరస్ ( Coronavirus ) బారిన పడుతున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ (Delhi ) లో కరోనా థర్డ్ వేవ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా దేశ రాజధానిలో నిత్యం 6 వేలకు పైగా కేసులు నమోదవుతన్నాయి. అయితే ఈ మహమ్మారి ప్రభావంతో మాజీ క్రికెటర్, భారతీయ జనతా పార్టీ (BJP) ఎంపీ గౌతం గంభీర్ ( MP Gautam Gambhir ) ఐసోలేషన్‌లోకి వెళ్లారు. గంభీర్ నివాస భవనంలో ఒకరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో.. సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్లినట్లు ఆయన శుక్రవారం ట్వీట్ చేసి వెల్లడించారు.
Due to a case at home, I have been in isolation awaiting my COVID test result. Urge everyone to follow all guidelines & not take this lightly. Stay safe!
— Gautam Gambhir (@GautamGambhir) November 6, 2020
తన నివాస భవనంలో ఒకరికి కరోనా సోకడంతో.. తాను స్వీయ నిర్భంధంలోకి వెళ్లానని.. కోవిడ్ టెస్ట్ రిపోర్ట్ కోసం ఎదురుచూస్తున్నానని గంభీర్ ట్విట్‌లో రాశారు. అయితే ప్రతీ ఒక్కరూ కోవిడ్ నిబంధనలను పాటించాలని.. ఈ మహమ్మారిని ఎవరూ కూడా తేలికగా తీసుకోవద్దని ఎంపీ గౌతం గంభీర్ అందరికీ సూచించారు. Also read: Delhi: కోవిడ్ 19 థర్డ్ వేవ్ ప్రారంభం
ఇదిలాఉంటే.. దేశ రాజధాని ఢిల్లీలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. ప్రతి రోజు 6 వేలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో దీపావళి పండుగ సందర్భంగా టపాసులను వినియోగించకుండా ఢిల్లీ ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ప్రకటన చేసిన విషయం తెలిసిందే. Also read: Covid-19: భారత విమాన సర్వీసులను రద్దు చేసిన చైనా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe